లిక్కర్ స్కామ్ లో కవితకు భారీ షాక్.. తప్పించుకునే మార్గం లేదా?

కేసీఆర్ కూతురు కవిత లిక్కర్ స్కామ్ కేసులో చిక్కుకున్నట్టేనా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. త్వరలో కవిత పేరును నిందితురాలి జాబితాలో చేర్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో కవితకు ఈ కేసుకు సంబంధించి మరిన్ని సమస్యలు ఎదురయ్యే ఛాన్స్ అయితే ఉందని కవిత జాగ్రత్త పడాల్సి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

అధికారులు కవితకు ఇచ్చిన నోటీసులో లిక్కర్ స్కామ్ కు సంబంధించిన డాక్యుమెంట్లతో పాటు ధ్వంసం చేసిన ఫోన్లను ఇవ్వాలని ఉంది. ధ్వంసం చేసిన ఫోన్లను ఇవ్వడం అంటే ఈ కేసులో తన హస్తం ఉందని కవిత చెప్పకనే చెప్పేసినట్టు అవుతుందని చెప్పవచ్చు. ఈ కేసు నుంచి కవిత తప్పించుకునే మార్గం లేదని కవిత రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడిందని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి.

కవిత విచారణ అనంతరం ఎలాంటి ప్రకటన చేయకపోవడం కూడా పలు అనుమానాలను తావిస్తోంది. సీబీఐ, ఈడీ కవితకు త్వరలోనే భారీ షాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యారని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. అన్నీ అనుకున్న విధంగా జరిగితే కవిత అరెస్ట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ కేసు నుంచి కవితను తప్పించడానికి కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయిందని సమాచారం అందుతోంది.

కవితకు ఈ కేసుతో ప్రమేయం ఉందని ప్రజల్లో సైతం భావన కలుగుతోంది. కవిత ఈ కేసులో మరింత చిక్కుకుంటే మాత్రం ఆమె పొలిటికల్ కెరీర్ ప్రమాదంలో పడుతుంది. ఈ విషయాలను గుర్తుంచుకుని కవిత అడుగులు వేయాల్సి ఉంది. సమస్యల నుంచి కవితకు త్వరలోనే పరిష్కారం లభించాలని అభిమానులు కోరుకుంటున్నారు.