Mumbai: ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లపై మురుగు నీరు ప్రవహిస్తోంది. ఈ వారాంతం వరకూ ముంబైలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయని తెలిపింది. ఇంతటీ తీవ్రతకు నిదర్శనంగా ముంబైలో జరిగిన ఓ సంఘటన సాక్ష్యంగా నిలిచింది. పార్కింగ్ లో పార్క్ చేసిన ఓ కారు ఏకంగా ముప్పై అడుగుల లోతు బావిలోకి మెల్లగా కూరుకుపోవడం షాక్ కు గురి చేస్తోంది. సెకన్లలోనే కారు నీళ్లలో మునిగిపోతున్న దృశ్యాలు ఇంటర్నెట్ లో విపరీతంగా వైరల్ అయింది. విస్తుగొలిపే ఈ సంఘటన ముంబైలోని ఘట్కోపార్ ప్రాంతంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..
డాక్టర్ కిరణ్ దోషి ఎప్పటిలాగే తన కారును పార్కింగ్ లో పెట్టాడు. కానీ అది 100 ఏళ్ల బావి. కానీ.. అక్కడ బావి ఉన్నట్టు ఎవరికీ తెలీదు. ఈ కారుకు అటు ఇటు కూడా కార్లు పార్క్ చేసి ఉన్నా వాటిపై ఎటువంటి ఎఫెక్ట్ పడలేదు. భారీ వర్షాల ధాటికి నేలపై నీరు పారుతుందనే అనుకున్నాడు డాక్టర్ దోషి. తన కారు బావిలో కూరుకుపోతున్నట్టు అది చూసిన వ్యక్తి చెప్పగా వెంటనే వెళ్లారు. క్షణాల్లోనే ఆయన కళ్లముందే కారు నెమ్మదిగా బావిలోకి వెళ్లిపోయింది. కారు ముందు భాగం బావిలో పడి మొత్తంగా వెళ్లిపోయింది.
ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ప్రస్తుతం క్రేన్ల సాయంతో మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది నీటిని తోడుతున్నారు. ప్రస్తుతం కారును బయటకు తీస్తున్నారు.