Beet Root: షుగర్ పేషెంట్స్ బీట్ రూట్ తినవచ్చా….తింటే ఏమవుతుంది?

Beet Root:ఈ ఆధునిక యుగంలో పని వత్తిడి, ఆహార పదార్థాల వల్ల చిన్న, పెద్ద అనే భేదం లేకుండా దాదాపు అందరినీ కలవరపెడుతున్న సమస్య షుగర్. ఇది ఒకసారి వచ్చింది అంటే ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు చేసుకోవాల్సి వస్తుంది. ఏ ఆహార పదార్థాలు తినాలి అన్నా కూడా మితంగానే తినాలి. షుగర్ లెవెల్స్ ఎక్కువగా కాకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది.షుగర్ పేషెంట్లు దాదాపుగా తీయని పదార్థాలకు దూరంగా ఉంటారు. అయితే కొన్ని పదార్థాలు తియ్యగా ఉన్నా కూడా తినాలా వద్దా అని చాలా మంది సందేహ పడుతుంటారు.. అలాంటి వాటిలో ఒకటి బీట్ రూట్.

బీట్ రూట్ లో శరీరానికి మేలు కలిగించే అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో ఐరన్, ఫోలేట్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. బీట్ రూట్ తినడానికి తియ్యగా ఉంటుంది. అందువలన షుగర్ పేషెంట్స్ దీన్ని తినడానికి భయపడుతుంటారు. షుగర్ పేషెంట్స్ బీట్ రూట్ ను తినవచ్చును, వారికి దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.

•షుగర్ పేషంట్ లు ఎక్కువగా హై బీపీతో ఇబ్బందిపడుతుంటారు. బీట్ రూట్ తినడము లేదా బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది.
• బీట్ రూట్ రిచ్చికి తియ్యగా ఉన్నాకూడా ఇందులో సహజ చక్కెర ఉంటుంది. భోజనం చేయడానికి ముందు బీట్ రూట్ ను తినడం మంచిది. భోజనానికి ముందు బీట్ రూట్ తినడం వల్ల ఇది రక్తం లోని చక్కెర స్థాయి ని అదుపులో ఉంచుతుంది. అంతేగాక శరీరానికి కావల్సిన అధిక శక్తిని ఇస్తుంది.షుగర్ పేషెంట్లు భోజనానికి ముందు బీట్ రూట్ తినడం వల్ల ఉదర సమస్యల నుండి బయట పడవచ్చు.
• బీట్ రూట్ లో శరీరానికి కావలసిన యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో లభిస్తాయి. ఫలితంగా షుగర్ వల్ల శరీరంలో వచ్చే గుండె, కిడ్నీ సమస్యలు తగ్గుతాయి.
షుగర్ పేషెంట్లు బీట్ రూట్ తగిన మోతాదులో తిన వచ్చు అని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. డయాబెటిక్ పేషెంట్లు ఎటువంటి సందేహం అవసరం లేకుండా బీట్ రూట్ తినవచ్చు.