Ambati File Defamation Case : మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మధ్య ట్విట్టర్ యుద్ధాన్ని చూసి అందరికీ చిరాకొచ్చేసింది. నెటిజన్లయితే ఇద్దరికీ చీవాట్లు పెడుతున్నారు. వైసీపీ మద్దతుదారులు, అంబటి రాంబాబుకి మద్దతు పలకడం, టీడీపీని విమర్శిస్తూ ట్వీట్లేయడం మామూలే. టీడీపీ మద్దతుదారులు అయ్యన్నకు మద్దతిస్తూ, అంబటి రాంబాబు మీద విరుచుకుపడటమూ మామూలే.
మరి, సాధారణ ప్రజానీకం ఏమనుకుంటున్నారు.? మంత్రి ఏం చేయబోతున్నారు.? మామూలుగా అయితే, తన మీద అసత్య ప్రచారం చేసినందుకుగాను అయ్యన్న పాత్రుడిపై మంత్రి అంబటి రాంబాబు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. పరువు నష్టం దావా వేసి తీరాలి.
లేదంటే, అయ్యన్న పాత్రుడు చేసిన ఆరోపణలే నిజమవుతాయి. కానీ, అంబటి రాంబాబు వాలకం చూస్తోంటే, అయ్యన్న పాత్రుడి మీద కేసు పెట్టేలా లేరు. ‘పెడితే, అంబటి బాగోతమే బయటపడుతుంది..’ అని టీడీపీ వర్గాలు చాలా ధీమాగా చెబుతున్నాయి.
ఓ మంత్రికీ, ఓ మాజీ మంత్రికీ మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ జరగడం అర్థం పర్థం లేని వ్యవహారం. ఆరోపణలు, ప్రత్యారోపణలతో టైమ్ పాస్ చేయడం ఇరువురికీ మంచిది కాదు. ఏదన్నా వుంటే, పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడం వల్ల కాస్తన్నా ఉపయోగం వుంటుంది మరి.! జనం ఇదే కోరుకుంటున్నారు.
అంబటి అందుకు సాహసించకపోవచ్చు.. అదే ధీమా అయ్యన్నపాత్రుడిది. ఇంతకీ అయ్యన్న దగ్గర మంత్రి అంబటికి సంబంధించిన అదనపు లీకులు ఏమన్నా వున్నాయా.? ఏమో, అయ్యన్నకే తెలియాలి.