YS Jagan: అంబంటికి బిగ్ షాక్ ఇచ్చిన వైఎస్ జగన్.. ఇది అసలు ఊహించి ఉండరుగా?

YS Jagan: వైకాపా మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రస్తుతం అధికారం లేకపోయినా నిత్యం సోషల్ మీడియాలోనూ మీడియా సమావేశాలలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ కూటమి పార్టీపై నిప్పులు చేరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఎప్పటికప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఈయన తమ పార్టీ గురించి తమ పార్టీ పట్ల చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ ఉన్నారు.

ఇలా జగన్ హయామంలో మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబు పార్టీ ఓటమిపాలు అయినప్పటికీ కూడా పార్టీలు మారకుండా జగన్మోహన్ రెడ్డికి పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతూ ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం అంబంటి రాంబాబుకు బిగ్ షాక్ ఇచ్చారని తెలుస్తోంది. ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ పదవిని అంబటి రాంబాబుకు ఇవ్వడం లేదని మరొక కీలక వ్యక్తికి ఆ బాధ్యతలు అప్పజెప్పబోతున్నారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి సత్తెనపల్లి ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి ఈ విషయం గురించి జగన్మోహన్ రెడ్డి త్వరలోనే అధికారికంగా వెల్లడించబోతున్నారని తెలుస్తుంది. ఇదే కనుక నిజమైతే అంబంటి రాంబాబుకు ఇది ఊహించని షాక్ అని చెప్పాలి. ఇప్పటివరకు ఈ విషయం గురించి అంబటి రాంబాబు అయితే ఎక్కడ స్పందించలేదు.

ఇకపోతే ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందారు అయితే గత ఎన్నికలకు ముందు ఈయన వైసీపీ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ షర్మిలకు మద్దతు తెలిపారు. ఇకపోతే కొద్ది రోజులకే తిరిగి వైయస్ జగన్ చెంతకు చేరారు కానీ ఈయనకు మాత్రం ఎక్కడ ఎమ్మెల్యే టికెట్ మాత్రం ఇవ్వలేదు. మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేస్తున్న లావణ్యకు మద్దతుగా నిలుస్తూ ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇక ప్రస్తుతం ఈయనని సత్తెనపల్లి ఇన్చార్జిగా నియమించబోతున్నారు అంటూ వార్తలు వినపడుతున్నాయి.