AP: ఏపీ మాజీ మంత్రి అంబంటి రాంబాబు తరచూ మీడియా సమావేశాలలో భాగంగా కూటమినేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇటీవల పోసాని కృష్ణమురళి అరెస్టు కావడంతో మరోసారి అంబటి రాంబాబు కూటమి నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ పోసాని అరెస్టును ఖండించారు.
పోసాని వైసీపీకి అనుకూలంగా మాట్లాడినందుకే ఆయనని టార్గెట్ చేస్తూ పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు..అరెస్ట్, కోర్టు విచారణ, రిమాండ్ చేయడం ఇవన్నీ కూడా చీకటి రాజకీయాలకు నిదర్శనం అని తెలిపారు. టిడిపి నేత పట్టాభి గతంలో చేసిన వ్యాఖ్యలను ఏమంటారు అంటూ ఈయన ప్రశ్నించారు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ లోకేష్ కంటే పోసాని బూతులు ఏమి మాట్లాడలేదని తెలిపారు.
ఇక పవన్ కళ్యాణ్ లోకేష్ వైసీపీ నేతలపై రెచ్చిపోయి మాట్లాడారు. మరి వారి వ్యాఖ్యలను గురించి ఏమంటారని అంబటి ప్రశ్నించారు. ఆ వ్యాఖ్యలు కూడా తీవ్ర విమర్శలకు, అనుచిత పదజాలానికి ఉదాహరణలేనని, అయితే అప్పట్లో వారిపై ఏ చర్యలు తీసుకోలేదని తెలిపారు. అంబటి రాంబాబు తన వ్యాఖ్యల్లో, వైసీపీకి చెందిన నాయకులు ప్రభుత్వ దాడులకు గురవుతూనే ఉన్నారని, రాజకీయ కక్షతో వారిని వేధిస్తున్నారని చెప్పారు.
ఇక పోసాని కృష్ణమురళి అరెస్టు కావడంతో వైసిపి నేతలు ఈయన అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నారు అంతేకాకుండా పోసాని ఆరోగ్య పరిస్థితి బాగాలేదని వైద్య పరీక్షలలో తేలినప్పటికీ పోలీసులు వాటిని ఏమాత్రం లెక్కచేయకుండా ఆయనని పలు స్టేషన్లు తిప్పుతూ ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తున్న విషయం తెలిసిందే.