Camphor: సాధారణంగా మనం పూజ చేసే సమయంలో పూజా సామాగ్రితో పాటు తప్పనిసరిగా కర్పూరం ఉంటుంది.ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజ ముగిసిన తరువాత కర్పూర హారతి ఇస్తూ ఆ హారతిని కళ్ళకు అద్దుకుంటాము. ఈ విధంగా కర్పూర హారతి ఇవ్వడం వల్ల మన ఇంట్లో కూడా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడటమే కాకుండా మన ఆలోచనలు కూడా ఎంతో పాజిటివ్ గా ఉంటాయి. అందుకోసమే కర్పూరం పూజలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. అయితే కర్పూరానికి కేవలం హారతికి మాత్రమే కాకుండా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు దివ్యౌషధంగా పనిచేస్తుంది.
కర్పూరంలో ఎన్నో రకాల యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉంటాయి.ఇవి మన శరీరంలో వివిధ రకాల సమస్యల నుంచి విముక్తి కల్పించడానికి ఉపయోగపడటమే కాకుండా మన చర్మ సౌందర్యాన్ని పెంపొందించడానికి కూడా దోహద పడతాయి. కీళ్లనొప్పుల సమస్యతో బాధపడేవారు ఆవ నూనెలో కొద్దిగా కర్పూరం వేసుకొని ప్రతిరోజూ ఈ నూనెతో మసాజ్ చేయడం వల్ల కీళ్లనొప్పుల సమస్య నుంచి బయటపడవచ్చు. అదేవిధంగా ఒక గ్లాసులో కాస్త నీటిని వేసి కర్పూరం వేయటం వల్ల మన ఇంటిలో ఎలాంటి కీటకాలు లేకుండా ఉండడమే కాకుండా ఆ వాసన వల్ల అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు.
శీతాకాలం మొదలవడంతో చాలామంది దగ్గు, జలుబు సమస్యలతో సతమతమవుతుంటారు. ఇలా సతమతమయ్యేవారు వేడినీటిలో కొద్దిగా కర్పూరం వేసుకుని ఆవిరి తీసుకోవడం వల్ల తొందరగా ఈ సమస్యనుంచి ఉపశమనం పొందవచ్చు.ఇక చర్మంపై మచ్చలు ఏర్పడిన వారు కొబ్బరి నూనెలో కొద్దిగా కర్పూరం వేసి ఆ నూనెను చర్మం పై మర్దన చేయడం వల్ల చర్మం పై ఏర్పడిన ముడతలు మచ్చలు తొలగిపోతాయి.కనుక కర్పూరం కేవలం హారతికి మాత్రమే కాదు ఎన్నో రకాల సమస్యల నుంచి కూడా విముక్తి పొందడానికి కీలక పాత్ర పోషిస్తుంది.