ఇంత పంతం పట్టేశాడు ఏంటి ఈ టీడీపీ మాజీ ఎమ్మెల్యే .. జగన్ – చంద్రబాబు కూడా షాక్ అయ్యారు

రాజకీయాల్లో గెలుపోటములు చాలా సహజం. అయితే కొంత మంది నాయకులు మాత్రం ఓటమిని తట్టుకోలేరు. అలా ఓడిపోయిన నాయకులు మళ్ళీ అదే నియోజకవర్గం నుండి మళ్ళీ గెలిచి తమ బలాన్ని నిరూపించుకోవాలని కొంతమంది నాయకులు అనుకుంటూ ఉంటారు. అలా అనుకుంటున్న నాయకుల్లో శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ ఒకరు. ఆయన తాను ఓడిపోయిన నియోజక వర్గం నుండి మళ్ళీ గెలవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.

Budda Rajashekar reddy plans for 2024 elections
Budda Rajashekar reddy plans for 2024 elections

రెట్టింపు వేగంతో వస్తున్న రాజశేఖర్

2014 ఎన్నికలో వైసీపీ తరపున గెలిచిన బుడ్డా రాజశేఖర్ తరువాత ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా టీడీపీలోకి వెళ్లారు. ఆ తరువాత ఆయనకు ప్రజల్లో ఆదరణ తగ్గుతూ వచ్చింది. దింతో 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అయిన శిల్ప చక్రపాణిరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ ఓటమి తరువాత ఆయన ఒక 15 నెలలు నియోజక వర్గానికి దూరంగా ఉండి, వ్యాపారాలు చూసుకుంటున్నారు. టీడీపీకి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన మళ్ళీ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటూ వైసీపీ నేతలకు, టీడీపీ నేతకు షాక్ ఇస్తున్నారు. గతంలో కంటే కూడా ఇప్పుడు ఎక్కువ బలంగా ప్రజలకోసం పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

వైసీపీని ఇరకాటంలో పెట్టనున్నారా!

నియోజక వర్గంలో ఉన్న సమస్యలపై పోరాడటానికి సిద్ధపడ్డ రాజశేఖర్ వైసీపీకి నాయకులపై పోరాటానికి సిద్ధపడుతున్నారు. ప్రధానంగా భారీ వర్షాలకు పంట నీటి మునిగి రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. వారికి పంట నష్టం కూడా ప్రభుత్వం నుంచి అందలేదు. దీనిపై ఆందోళన చేయాలని బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిర్ణయించారు. రైతు సమస్యలపై పోరాడేందుకు బుడ్డా రాజశేఖర్ రెడ్డి రెడీ అయ్యారు. గత పదిహేను నెలలుగా శ్రీశైలం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరగకపోవడాన్ని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇలా పోరాటానికి సిద్ధపడుతూ చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లను ఆశ్చర్యానికి గురి అవుతున్నారు.