Health Tips: మనుషులు లాగే పశువులను కూడా అనేక రకాల వ్యాధులు వేధిస్తాయి. అటువంటి వ్యాధులలో” బ్రూసెల్లోసిస్” వ్యాధి కూడా ఒకటి. ఈ వ్యాది చాలా ప్రమాదకరమైనది. బ్రూసిల్లా అబార్టస్ అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి పశువులకు సోకుతుంది.దీనిని బ్యాంగ్స్ వ్యాధి అని కూడా అంటారు. పశువులకు ఈ వ్యాధి సోకడం వల్ల చూడి పశువుల్లో గర్భస్రావం జరుగుతుంది. కొడెలు దున్నలకు ఈ వ్యాది సోకితే వాటిలో సంతానోత్పత్తి శక్తి తగ్గుతుంది.
ఈ వ్యాధి పశువుల నుండి మనుషులకు కూడా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది. పశువులకు చాలా కాలం నుంచి ఈ వ్యాధి వస్తున్నప్పటికీ దీని నివారణకు ఎటువంటి వ్యాఖ్యలు లేవు. ఇటీవల ఈ ఈ వ్యాధిని అంతమొందించడానికి వ్యాక్సిన్ కనుగొన్నారు. ఈ ఏడాది జనవరి నుండి ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వాలు ఈ వ్యాధి నివారణ ను ఒక జాతీయ ప్రాజెక్టుగా తీసుకొని దశలవారీగా దేశంలోని నాలుగు నెలల వయస్సు దాటిన ఎనిమిది నెలల లోపు పశువులకు వ్యాక్సిన్ అందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి.
ఈ వ్యాధి సోకిన పశువుల ద్వారా వచ్చిన పాలు పెరుగు వెన్న వంటివి తీసుకోవడం వల్ల మనుషులకు వ్యాప్తి చెందుతుంది. పురుషులకు ఈ వ్యాధి సోకినప్పుడు వారిలో వృషణాలు వాపు చెందటం మాత్రమే కాకుండా నపుంసకత్వం వచ్చే ప్రమాదం ఉంటుంది.ఈ వ్యాధి సోకిన పురుషులలో వీర్యం సక్రమంగా విడుదల కాక సంతానోత్పత్తి సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. మహిళలకు ఈ వ్యాధి సోకితే మహిళల్లో పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గిపోతాయి. గర్భవతులకు ఈ వ్యాధి సోకినప్పుడు అబార్షన్ అయ్యే అవకాశం ఉంటుంది.