KTR: కవిత లేఖ పై రియాక్ట్ అయిన కేటీఆర్…. మా పార్టీ ఆచారం అంటూ కామెంట్స్!

KTR: బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల తన తండ్రి కెసిఆర్ కు రాసిన ఒక లెటర్ సోషల్ మీడియాలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే అదే విధంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కూడా ఈ లెటర్ సంచలనాలను రేపుతోంది.. ఇలా తన తండ్రికి కవిత లెటర్ రాయడంతో బిఆర్ ఎస్ పార్టీలో ఏదో జరుగుతుందని ఈ పార్టీలో విభేదాలు కూడా చోటు చేసుకున్నాయన్న సందేహాలు స్పష్టమవుతుంది.

ఇలా ఈ లెటర్ సోషల్ మీడియాలో సంచలనంగా మారడంతో శుక్రవారం రాత్రి అమెరికా నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకున్న కవిత ఘాటుగా స్పందించారు. తన తండ్రికి రెండు వారాల క్రితం ఆ లెటర్ నేనే రాశాను కానీ బయటకు ఎలా వచ్చిందో తెలియట్లేదని తెలిపారు. మా నాన్న కేసీఆర్ దేవుడు కానీ ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయి అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపాయి.

ఇలా లెటర్ గురించి అలాగే పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు నేతలు గురించి కవిత ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో పార్టీలో ఏదో పెద్ద ఎత్తున విభేదాలు చోటు చేసుకున్నాయని స్పష్టమవుతుంది. ఇలాంటి తరుణంలోనే బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ లెటర్ పై స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇటీవల తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించిన కేటీఆర్ కు రిపోర్టర్ నుంచి కవిత రాసిన లెటర్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు కేటీఆర్ సమాధానం చెబుతూ…లోక్ సభ ఎన్నికల ముందు పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా సమావేశం పెట్టాం. వేల మంది కార్యకర్తలతో కూర్చొని పార్టీలోని అంశాలు, స్థానిక రాజకీయ పరిస్థితులపై చర్చించాం.

ఈ కార్యక్రమంలో భాగంగా కొంతమంది నాయకులు అక్కడే వేదికపై మైక్ లో మాట్లాడుతూ వారు చెప్పాల్సిన విషయాలను చెప్పేశారు. మరి కొంతమంది వ్యక్తిగతంగా లెటర్లు రాసి మా నాయకుడు కేసీఆర్ గారికి వారి అభిప్రాయాలను తెలియజేశారు. మా పార్టీ అధ్యక్షుడికి సూచనలు చేయాలంటే ఉత్తరాలు రాయొచ్చు. మా పార్టీలో డెమోక్రసీ ఉంది కాబట్టే మా పార్టీ అధ్యక్షుడికి మా పార్టీ నాయకులు ఎవరైనా సరే సూచనలు ఇవ్వచ్చని కేటీఆర్ తెలిపారు.

మా పార్టీలో వీరు ప్రత్యేకం అని ఏమీ లేదు మా పార్టీలో ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలేనని కవిత పేరును, ఆమె రాసిన లేఖను ప్రస్తావించకుండా కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. కోవర్టులు వాళ్లకు వాళ్లే బయటపడతారు అంటూ కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో తీవ్రదుమారం రేపుతున్నాయి.