China Land Slides: చైనాలో విరిగిపడ్డ కొండ చరియలు..14 మంది మృత్యువాత..!

China Land Slides: చైనాలో ఒక ఘోర సంఘటన చోటుచేసుకుంది భవన నిర్మాణం జరుగుతున్న సమయంలో కొండచరియలు విరిగిపడటంతో ఏకంగా 14 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో ఎంతో మంది గాయపడ్డారు. చైనాలోని గుయిజౌ ప్రావిన్స్‌లోని బిజీ నగరంలో సోమవారం రాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.ఇలా కొండచరియలు విరిగి పడగానే వెంటనే అప్రమత్తమైన అధికారులు సంఘటనా స్థలానికి సిబ్బందిని పంపి పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలోనే ఈ ఘటనలో 14 మందిమృతదేహాలను వెలికి తీయగా మరో ముగ్గురు గాయపడినట్లు గుర్తించి వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటివరకు ఎంతమంది గాయపడ్డారు అనే విషయాన్ని బయటకు వెల్లడించలేదు. ఈ క్రమంలోనే అధికారులు ఈ సంఘటన జరగడానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు.

గుయిజౌ ప్రావిన్స్‌ అతి తక్కువ అభివృద్ధి చెందిన నగరాల్లో ఒకటి. అక్కడ పర్వతాలు, లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి.అయితే ఇలాంటి ఘటనలు ఈ ప్రాంతంలో తరచుగా సంభవిస్తూనే ఉంటాయి ఇలా 2019 లో అధిక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇలా కొండచరియలు విరిగిపడి ఏకంగా 16 మంది మృత్యువాత పడగా 30 మంది గాయాలపాలయ్యారు. అలాగే ఇలాంటి ఘటన గత ఏడాది సెప్టెంబర్ నెలలో కూడా అధిక వర్షాల కారణంగా చోటు చేసుకుంది. అయితే ఈ ఏడాది కూడా కొండచరియలు విరిగిపడటంతో అధికారులు వెంటనే అప్రమత్తమై ఎక్కువ ప్రాణ నష్టం కలుగకుండా సహాయక చర్యలు చేపట్టారు.