టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుందా? మోదీ– షాలు ఆయన్ని మళ్లీ దగ్గరకు చేరనిచ్చే అవకాశం ఉందా? అంటే ఎంత మాత్రం లేదని మరోసారి స్పష్టమైంది. చంద్రబాబు ఎంత కాకా పట్టినా బీజేపీ ఎక్కడా కరుణించని సంగతి తెలిసిందే. తాజాగా అదే విషయాన్ని మరోసారి బీజేపీ రాష్ర్ట ఇంచార్జ్ సంచలన ట్వీట్ తో కుండబద్దలు కొట్టేసారు. చంద్రబాబు వెన్నపోటు రాజకీయాలను ఉద్దేశించి ఆసక్తికర ట్వీట్లు చేసారు. ముఖ్యమంత్రి స్థానం నుంచి ఎన్టీఆర్ ని బలవంతంగా తప్పించి మంగళవారానికి 25 ఏళ్లు పూర్తయ్యాయి. అందుకు గాను ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు.
చంద్రబాబుకి అన్ని రోజులు కన్నా ఈరోజు బాగా గుర్తుంటుంది. వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును 25 ఏళ్ల క్రితం అదే రోజున ఎన్టీఆర్ పార్టీ నుంచి బహిష్కరించారు. బీజేపీనీ..ప్రధాని మెదీని చంద్రబాబు అలాగే మోసం చేసారు. అధికారాన్ని కోల్పోయిన బాబు త్వరలోనే రాజకీయాల నుంచి తప్పుకోబుతున్నారని సునీల్ దియోధర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో మరోసారి బీజేపీ టీడీపీ పట్ల ఎంత ఆవేశంగా ఉందో అర్ధమైంది. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలపై బీజేపీ ఎంత ఆగ్రహంతో ఊగిపోతుందో ఈ ట్వీట్ తో మరోసారి బయట పడింది. ఏపీలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా టీడీపీని మాత్రం పుట్టగతులు లేకుండా చేయడమే బీజేపీ ప్రధాన అజెండాగా పెట్టుకున్నట్లు మరోసారి తేటతెల్లమైంది.
రాష్ర్ట స్థాయిలో అధికార పక్షం నేతలు…సీఎం జగన్మోహన్ రెడ్డి– చంద్రబాబును ఎంతలా విబేధిస్తున్నారో? అంతకు రెట్టింపు పగ తీర్చుకోవడానికి బీజేపీ పావులు కదుపుతున్నట్లు మరోసారి రుజువైంది. అటు అధికారం పక్షం…ఇటు మాజీ మిత్ర పక్షం సవాళ్లను..చర్యలను, భవిష్యత్ లో ఎదురయ్యే పరిస్థితులను చంద్రబాబు ఎలా ఎదుర్కుంటారో మరి. మొత్తానికి చంద్రబాబు చుట్టూ ఎన్నడు లేని క్లిష్ట పరిస్థితులు చుట్టుకుంటున్నాయి. పార్టీలో కీలక నేతలు..మాట సహాయం చేసే వాళ్లు…ఐడియాలు ఇచ్చే నేతలంతా అవినీతి కేసుల్లో జెళ్లకు వెళ్తోన్న సంగతి తెలిసిందే.