బాక్సాఫీస్ : డే 1 “రామారావు ఆన్ డ్యూటీ” వసూళ్లు ఎంత వచ్చాయంటే.!

Ramarao on Duty

ఈ ఏడాది మళ్ళీ ఈ జూలై చివరిలో అయినా టాలీవుడ్ కి కాస్త గడ్డు కాలం తప్పింది అనుకుంటే మళ్ళీ మాస్ మహారాజ రవితేజ చిత్రం “రామారావు ఆన్ డ్యూటీ” ఫలితం దెబ్బ తీసింది. నూతన దర్శకుడు శరత్ మండవ తో చేసిన ఈ చిత్రం అనుకున్న రేంజ్ రెస్పాన్స్ ని అయితే అందుకోలేకపోయింది.

దీనితో ఈ చిత్రానికి మార్నింగ్ షో కి బాగానే ఆడియెన్స్ వచ్చినా తర్వాత మళ్ళీ షరా మాములు అయిపొయింది. దీనితో ఈ చిత్రానికి కూడా వసూళ్లు పరంగా నిరాశ తప్పేలా లేదని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. మరి ఈ సినిమాకి మొదటి రోజు వసూళ్ల డీటెయిల్స్ తెలుస్తున్నాయి.

అయితే మేకర్స్ అధికారికంగా వీటిని అనౌన్స్ చెయ్యలేదు కానీ ఈ సినిమాకి మాత్రం తెలుగు రాష్ట్రాలు సహా ఓవరాల్ గా అయితే అంత మంచి వసూళ్లే రాలేదని చెబుతున్నారు. మరి దీని ప్రకారం అయితే ఈ చిత్రానికి ఏపీ తెలంగాణలో 2.75 కోట్లు షేర్ రాగా 4.65 కోట్లు గ్రాస్ ని అందుకుంది తెలుస్తుంది.

ఇక మిగతా ఇండియా సహా ఓవర్సీస్ కలిపి మరో రెండున్నర కోట్ల మేర షేర్ అందుకున్నట్టు తెలుస్తుంది. దీనితో అయితే మొదటి రోజు రామారావు ఆన్ డ్యూటీ చిత్రం ఇలాంటి వసూళ్లను రవితేజ కెరీర్ లో తక్కువ అందుకుంది. ఇక ఈ చిత్రానికి సామ్ సి ఎస్ సంగీతం అందించగా అన్వేషి జైన్ హాట్ ఐటెం సాంగ్ చేసింది. అలాగే మజిలీ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటించింది.