AP: ఏపీలో ఫుల్ ఫాలోయింగ్ ఉన్నది ఆ ఇద్దరికే… కేతిరెడ్డి కామెంట్స్ వైరల్!

AP: వైకాపా నాయకుడు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటారు. ఈయన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి అలాగే సొంత పార్టీ వారి గురించి పాలక పక్షం గురించి కూడా ఏ విషయాన్ని దాచుకోకుండా నిర్మొహమాటంగా మాట్లాడుతూ ఉంటారు.

ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఈయన సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు రాజకీయాలలోకి రావడం గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. సినిమా ఇండస్ట్రీలో కొనసాగే వారికి రాజకీయాలు పెద్దగా సూట్ అవ్వవు అని తెలిపారు. ప్రస్తుతం మన ఏపీలోనే చూడండి చిరంజీవి రాజకీయాలలోకి వచ్చారు పాలకొల్లు తిరుపతిలో పోటీ చేశారు ఆయన తన సొంత ఊరిలోనే ఓడిపోయి తిరుపతిలో గెలిచారు అనంతరం పార్టీని ముందుకు నడిపించడం చేతకాక పార్టీని కాంగ్రెస్లోకి విలీనం చేశారని తెలిపారు.

ఇక పవన్ కళ్యాణ్ సైతం జనసేన పార్టీని పెట్టి పోటీ చేసి చేసి చివరికి పొత్తుతో గెలిచారు. ఇక బాలకృష్ణ విషయానికి వస్తే ఆయన హిందూపురంలో నిలబడుతున్నారు కాబట్టి ఏదో అలా గెలుస్తున్నారు అలా కాకుండా ఒకసారి గుడివాడ నుంచి పోటీ చేసి చూడండి ఆయన కూడా అక్కడ గెలవలేరు అంటూ మాట్లాడారు. వాస్తవానికి సినిమా ఇండస్ట్రీలోనూ అలాగే రాజకీయాలలో కూడా ఎంతమంది స్టార్స్ ఉన్నా ఇద్దరికీ మాత్రమే మంచి ఫాలోయింగ్ ఉందని కేతిరెడ్డి తెలిపారు.

రాజకీయాలలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తులలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకరు అలాగే సినిమా ఇండస్ట్రీలో ఫాలోయింగ్ ఉన్నవారిలో పవన్ కళ్యాణ్ ఒకరు ఏపీలో ఈ ఇద్దరికే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని తెలిపారు. వీరిద్దరూ ఎక్కడ సభలు పెట్టిన పిలవకుండానే సుమారు పదివేల మందికి పైగా అభిమానులు వస్తారు. ఇక వీరు కాకుండా ఎవరు పార్టీ మీటింగులు పెట్టిన సభలు పెట్టిన అక్కడికి ప్రజలు రావాలి అంటే మేనేజ్మెంట్ చేసుకోవాల్సిందే అంటూ కేతిరెడ్డి చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.