AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. 2019 ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గా పోటీ చేసి ఏకంగా 151 స్థానాలలో అద్భుతమైన మెజారిటీని సొంతం చేసుకుంది. అయితే ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన అనంతరం 2024 ఎన్నికలలో 175 స్థానాలలో మేమే గెలుస్తామంటూ వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేసినప్పటికీ కూటమి గెలుస్తుందని ఎన్నో ఎగ్జిట్ పోల్ సర్వేలు ఎన్నికల ఫలితాలను ముందుగానే చెప్పేశాయి. ఇక ఎగ్జిట్ పోల్ ఫలితాల మేరకు కూటమి పార్టీలు ఊహించని విధంగా 164 స్థానాలలో విజయం సాధించి అధికారాన్ని అందుకున్నాయి.
ఇక కూటమి విజయం సాధించి సరిగ్గా ఏడాది పూర్తి అయిన నేపథ్యంలో ఈ ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వ పాలన గురించి ప్రజల అభిప్రాయం ఏంటి అనే విషయంపై ఎన్నో సర్వే సంస్థలు సర్వేల ద్వారా బయటపెడుతున్నాయి. ఇటీవల కేకే సర్వే కొంతమంది ఎమ్మెల్యేలకు 30% ఓట్ షేర్ తగ్గిందని ఆయన తన రివ్యూ ఇచ్చారు అయితే తాజాగా మరొక సర్వేలో సంచలన విషయాలు బయటపడ్డాయి.రాష్ట్రంలో గత ఎన్నికలకు ముందు కూటమి కచ్చితంగా గెలిచి తీరుతుందని పలు సర్వేలు, విశ్లేషణలు చేసిన సర్వేయర్ ప్రవీణ్ పుల్లట ఒకరు.
తాజాగా ఈయన కూటమి ఏడాది పాలన గురించి సర్వే చేయించారని అందుకు సంబంధించి హింట్ ఇస్తూ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.ఇవాళ ప్రవీణ్ పుల్లట తాను చేసిన ట్వీట్ లో ప్రభుత్వ పెద్దలు కష్టబడుతున్నారు. మెజారిటీ ఎమ్మెల్యే, ఎంపీలు కష్టపెడుతున్నారు.. అంటూ సింపుల్ గా రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒక్క మాటలో చెప్పేశారు.అలాగే ప్రాంతాల వారీగా జాతకాలు రెడీ అవుతున్నాయంటూ మరో లీక్ ఇచ్చారు. మరిన్ని వివరాల కోసం ఎదురుచూస్తూ ఉండాలని కోరారు. ఈయన సర్వే ప్రకారం ప్రభుత్వ పెద్దలు అంటే లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముగ్గురు ప్రజల కోసం కష్టపడుతున్నప్పటికీ కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రం ప్రజలను కష్టపెడుతున్నారని చెప్పకనే చెప్పేశారు.