వైసీపీ ఎమ్మెల్యేకు దెబ్బ మీద దెబ్బ.. ఈసారి జగన్ చేతుల్లోనే

YSRCP MLA 
గత దఫాలో మంత్రి పదవులు దక్కించుకోలేకపోయినా సీనియర్ నాయకులంతా ఇప్పుడు సత్తా చాపాలని ప్రయత్నిస్తున్నారు.  పంచాయతీ ఎన్నికలను వేదికగా చేసుకుని మంచిపనితనం కనబర్చి అధినేత జగన్ దృష్టిలో పడాలని చూస్తున్నారు.  వైసీపీ నాయకుల్లో మంత్రివర్గ విస్తరణలో భాగంగా పదవుల మీద చాలామందే ఆశలు పెట్టుకున్నప్పటికీ కొందరికే అవకాశం కనిపిస్తోంది.  అలాంటి వారిలో మాజీ మంత్రి, పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి కూడ ఒకరు.  ఈయనకు మొదట్లోనే పదవి దక్కాల్సి ఉండగా యాదవ సామాజికవర్గం నుండి అనిల్ కుమార్ యాదవ్ ను కేబినెట్లోకి తీసుకోవడంతో పదవి మిస్సయింది.   
YSRCP MLA 
YSRCP MLA
దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన ఆయన పార్టీకి దూరం జరిగారు.  నియోజకవర్గానికే పరిమితమయ్యారు తప్ప జిల్లా రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం మానేశారు.  అధినేత ఇచ్చిన ఏ పిలుపునూ అందుకోలేకపోయారు.  గతంలో కేబినెట్ మంత్రిగా చేసి ఉండటంతో మంత్రి పదవిని ప్రిస్టేజ్ ఇష్యుగా భావించి ఈగోకి వెళ్లారు.  దీన్ని గమనించిన జగన్ విప్ పదవి ఆఫర్ చేసినా కాదన్నారు.  చివరికి టీటీడీ బోర్డు మెంబర్ పదవి ఇవ్వడంతో కొంత శాంతించారు.  ఆ పదవి తర్వాత పార్టీలో కొద్దిగా యాక్టివ్ అయినా ఈయన మళ్ళీ ఇప్పుడు పాత పాటే పాడారు.  అనిల్ కుమార్ యాదవ్ మరో రెండున్నరేళ్లు మంత్రిగా కొనసాగే అవకాశం ఉందని తెలియడంతో ఎంత పాకులాడినా లాభం లేదనుకుని కాడి దించేశారు. నియోజకవర్గానికి మొహం చాటేశారు. 
 
అదే ఇప్పుడు పొరపాటైపోయింది.  పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పెనమాలోరు బాధ్యతలు పార్థసారథి మీదే పడ్డాయి.  పెనమలూరు పరిధిలో అన్ని పదవులు వైసీపీ మద్దతుదారులకు దక్కాలనే అల్టిమేటం వెళ్లిందట ఆయనకు.  కానీ గత రెండున్నరేళ్లు నిరాశలోనే గడిపి నియోజకవర్గం మీద పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో సొంత సామాజికవర్గంలోనే అసంతృప్తి నెలకొందట.  పైగా కొలుసు అలసత్వాన్ని గమనించిన టీడీపీ నేత బోడె ప్రసాద్ చాపకింద నీరులా పనిచేసుకుంటూ శ్రేణులను కాపాడుకున్నారు.  ప్రస్తుతం పెనమలూరులో టీడీపీ పటిష్టంగానే కనబడుతోంది.  దీంతో పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ సంపూర్ణ మెజారిటీ కనబర్చే అవకాశాలు తక్కువే అంటున్నారు.  అలా మంత్రి పదవి దక్కలేదనే నిరాశావాదం పార్థసారథిని మరిన్ని కష్టాల్లోకి నెట్టేసింది.