పంజాబ్‌లో ఆఫ్.. గోవాలో హంగ్‌‌.. ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలు ఇవే!

ఐదు రాష్ట్రాల్లో ఏడు విడతల్లో జరిగిన ఎన్నికలు నేటితో ముగిశాయి. ఈ నేపథ్యంలో ఏ రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారనే విషయంపై ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలు వేశాయి. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైంది. ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మళ్ళీ అధికారంలోకి రావడం  కష్టమేనని ఎగ్జిట్ పోల్స్‌ గణంకాలు తెలుపుతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్‌కు ఎడ్జ్ ఉన్నట్లుగా అంచనా వేశాయి. పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) అధికారంలోకి రానుంది దాదాపు అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ స్పష్టం చేశాయి. మణిపూర్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను పరిశీలిస్తే బీజేపీ మరోసారి అధికారాన్ని చేపట్టనున్నట్లు సర్వేల ఫలితాల్లో తేలింది. గోవాలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య టప్ ఫైట్ నడుస్తోంది. ఇక్కడ హంగ్‌‌కు అవకాశం ఉన్నట్లు.. చిన్న పార్టీలు కింగ్‌ మేకర్స్ అవుతాయని వెల్లడించాయి.