తెలంగాణ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్… తెరపైకి హంగ్ సర్కార్ చర్చ!

తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది! దీంతో… వాటి తుది ఫలితాలు వెలువడేలోపు మధ్యలో ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలపై అంచనాలు అందరిలో ఆసక్తి కలిగిస్తాయి. ఈ నేపథ్యంలో ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెలువడుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటివరకూ అందుతున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం తెలంగాణలో హంగ్ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందని చెబుతుండటం గమనార్హం!

అవును… ఇప్పటివరకూ వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం తెలంగాణలో బీఆరెస్స్, కాంగ్రెస్ మధ్య నెక్ టు నెక్ పోటీ తప్పదని తెలుస్తుంది. ఈ సమయంలో మూడు ప్రధాన పార్టీలు కాకుండా ఉండే ఇతరుల సీట్లు కీలకంగా మారబోతున్నాయని తెలుస్తుంది. ఇప్పుడు ఆయా సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం!

ఈ క్రమంలో… జన్‌ కీబాత్‌ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ – బీఆరెస్స్ ల మధ్య హోరా హోరీ పోరు తప్పదని తెలుస్తుంది. ఈ ఫలితాల ప్రకారం బీఆరెస్స్ కు 40 – 55 స్థానాలు, కాంగ్రెస్ కు 48 – 64 స్థానాలూ వచ్చే అవకాశం ఉండగా… బీజేపీ 7 – 13 స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెబుతుంది. ఇక ఎంఐఎం కి 4 – 7 స్థానాల్లో సత్తా చాటే ఛాన్స్ ఉంది!

ఇదే క్రమంలో సీ.ఎన్.ఎన్. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీఆరెస్స్ కు 40 – 55, కాంగ్రెస్ కు 48 – 64, బీజేపీకి 7 – 13, ఎంఐఎం కు 4 – 7, ఇతరులు ఒక్క స్థానాల్లోనూ గెలిచే అవకాశం ఉంది! ఈ ఫలితాల ప్రకారం ఇతరులకు ఒక్కసీటు కూడా వచ్చే అవకాశం లేదని తెలుస్తుంది.

ఇదే సమయంలో ఆరా సంస్థ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం… బీఆరెస్స్ కు 41 నుంచి 49 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 58 నుంచి 67 స్థానాలు, బీజేపీకి 5 నుంచి 7 స్థానాలూ రాగా… ఇతరులకు 7 – 9 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అంటే… ఈ సంస్థ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ 60 స్థానాలను సాధించే అవకాశం ఉంది!

అదేవిధంగా ఇండియా టీవీ – సీ.ఎన్.ఎక్స్ సర్వే ప్రకారం కూడా కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ ని దాటే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ ఫలితాల ప్రకారం బీఆరెస్స్ కు 31 – 47 స్థానాలు వచ్చే అవకాశం ఉండగా… కాంగ్రెస్ కు 63 – 79 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని స్పష్టమవుతుంది. ఇక బీజేపీకి 2 – 4 స్థానాలు.. ఎంఐఎం కు 5 – 7 స్థానాల్లో గెలుపు అవకాశాలున్నాయని తెలుస్తుంది.

ఇక సీపీఎస్ ఫలితాల ప్రకారం బీఆరెస్స్ కు మ్యాజిక్ ఫిగర్ పక్కా అని తెలుస్తుంది. ఈ ఫలితాల ప్రకారం బీఆరెస్ కు 72 (+/-6), కాంగ్రెస్ కు 36 (+/-5), స్థానాలు వచ్చే అవకాశం ఉంది. ఇక బీజేపీ విషయానికొస్తే… 01 – 03, ఇతరులకు 7 – 9 స్థానాల్లో విజయం దక్కే అవకాశం ఉందని తెలుస్తుంది.

ఇదే సమయంలో పోల్ స్టార్ట్ ఇచ్చిన సర్వే ప్రకారం బీఆరెస్స్ కు 48 – 58 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 49 – 56 స్థానాలు వచ్చే అవకాశం ఉండగా… బీజేపీకి 5 – 10 స్థానాలు, ఎంఐఎం కు 6 – 7 స్థానాలూ వచ్చే అవకాశం ఉందని స్పష్టమవుతుంది.