Modi: జగన్ విషయంలో మోడీ నిర్ణయం అదేనా… అందుకే సైలెంట్ గా ఉన్నారా?

Modi: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకుంది. ఇలా ఈ ఏడాది కాలంలో సంక్షేమం అభివృద్ధి పక్కన పెడితే వైసీపీని కూటమి ప్రభుత్వం మాత్రం భారీగా టార్గెట్ చేసిందని చెప్పాలి. అధికారంలోకి రాగానే పెద్ద ఎత్తున వైసిపి నేతలను అరెస్టు చేస్తూ జైలుకు పంపిస్తున్నారు ఇప్పటికీ కూడా ఈ అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇలా తెలుగుదేశం పార్టీ జనసేన ఈ రెండు పార్టీలు వైసీపీని టార్గెట్ చేసినప్పటికీ కూటమిలో మరొక పార్టీ అయిన బిజెపి మాత్రం చాలా మౌనంగా ఉంటుంది.

ఇలా ఏపీలో ముఖ్యంగా వైసిపి పార్టీ విషయంలో బిజెపి మౌనంగా ఉండటం వెనుక కారణమేంటనే సందేహాలు ప్రతి ఒక్కరికి కలుగుతున్నాయి ముఖ్యంగా తిరుపతి లడ్డు వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత జనసేన తెలుగుదేశం పార్టీ రెండు కూడా వైసీపీ నేతలపై అలాగే జగన్మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించాయి. ఈ వివాదం గురించి జాతీయ మీడియాలలో కూడా చర్చలు జరిపాయి. అయితే ఈ విషయంలో బిజెపి ఏదో మాట్లాడాలి అంటే మాట్లాడే విధంగా స్పందించింది.

ఏపీని అప్పుల కుప్ప చేసి పారేసింది వైసీపీ ప్రభుత్వం అని టీడీపీ ఆరోపిస్తూ వెళ్ళింది. అంతే కాదు అసెంబ్లీ లోపలా బయటా అనేక విధాలుగా నంబర్లు చెప్పి వైసీపీని కార్నర్ చేశారు. అయితే ఈ విషయంలో బీజేపీ పరిమితంగానే రియాక్ట్ అయ్యారు. ఇక చివరిగా లిక్కర్ స్కాం గురించి వైసిపి పై తెలుగుదేశం పార్టీ చేసిన ఆరోపణలు అన్ని ఇన్ని కాదు ఏకంగా జగన్మోహన్ రెడ్డి అరెస్టు కావచ్చనే వార్తలు కూడా వెలుగులోకి వచ్చాయి. కానీ లిక్కర్ స్కాం విషయంలో బిజెపి నుంచి పెద్దగా స్పందన లేదని చెప్పాలి.

ఇలా జగన్ విషయంలో మోడీ సైలెంట్ గా ఉండడానికి కారణం లేకపోలేదు ప్రస్తుతం కూటమిలో ఉన్నటువంటి బిజెపికి వైసీపీ శత్రువే అయినప్పటికీ భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ జగన్ గురించి ఏ విధమైనటువంటి ఆరోపణలు చేయకుండా విమర్శలు చేయకుండా ఉన్నారు. ఏపీలో తన పట్టుకుని సాధించాలంటే ఎప్పటికి ఏది అవసరమో దానిని బట్టే ముందుకు సాగాలన్నదే బీజేపీ స్టాండ్ అని అంటున్నారు.మరో నాలుగేళ్ళలో ఎన్నికలు ఉంటాయి. అలా చూస్తే భవిష్యత్తు వ్యూహాలే బీజేపీకి ముఖ్యమని అంటున్నారు.