తెలంగాణలో ఇప్పుడు నూతన రాజకీయం మొదలైంది. ఈ రాజకీయాల్లో టీఆర్ఎస్ చాలా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే సాగర్ ఉప ఎన్నికలో, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో టీఆర్ఎస్ చాలా ఎదురుదెబ్బలు తతగిలాయి. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ కు సొంత పార్టీ నేతల నుండి ఇబ్బందులు ఎదురు కనున్నాయని బీజేపీ నేతలు చెప్తున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు సొంత పార్టీ పెట్టడానికి కూడా సిద్ధయ్యరని వార్తలు వస్తున్నాయి.
సొంత పార్టీ పెట్టనున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు!!
ఎల్బీ నగర్ లోని రంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో బీజేపీ లో ప్రయివేట్ టీచర్స్ జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ… మంత్రి పదువుల కోసం టీఆర్ఎస్ లో కొట్లాట జరుగుతోందట అని ఆయన ఎద్దేవా చేసారు. మంత్రివర్గంలోకి తీసుకోకుంటే సొంత పార్టీ ఏర్పాటుకు ముగ్గురు ఎమ్మెల్యేలు ప్లాన్ చేస్తున్నారని సమాచారం అని ఆయన అన్నారు. అలాగే విద్య వ్యవస్థను టీఆర్ఎస్ నాశనం చేస్తుందని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ ను సీఎం చెయ్యడానికి కేసీఆర్ అనారోగ్యం డ్రామా ఆడుతున్నారని బండి ఎద్దేవా చేశారు.
కేటీఆర్ సీఎం కానున్నారా??
త్వరలో కేటీఆర్ సీఎం కానున్నారని చాలా రోజుల నుండి ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే మాత్రం ఆ వార్త నిజం అయ్యేలా ఉంది. ఒకవేళ కేటీఆర్ సీఎం అయితే మాత్రం టీఆర్ఎస్ లో కూడా విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కేటీఆర్ బాధ్యత వహించిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయో అందరం చూసాం, ఇలాంటి సందర్భంలో కేటీఆర్ సీఎం అయితే టీఆర్ఎస్ పార్టీ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూద్దాం.