జగన్ లాగా చేతులు కట్టుకుని లేము మేము .. ఏబిఎన్ కి బీజేపీ సెన్సేషనల్ వార్నింగ్..!

ABN RK Weekend Comment

ప్రస్తుత రాజకీయాల్లో పార్టీకో న్యూస్ పేపర్, పార్టీకో ఛానల్ ఉన్నాయి. ఈ ఛానల్, పత్రికలు తమ చేసే చెత్తపనుల్లో కూడా మంచి చూపిస్తూ ఉండాలి లేదంటే అవతలి పార్టీ వాళ్ళు చేసే అన్ని పనుల్లో తప్పులు పడుతూ ఉంటారు. ఈ చానెల్స్, న్యూస్ పేపర్స్ ఇలా సిగ్గు లేకుండా పార్టీల కోసం పని చేస్తూమీడియా పరువు తీస్తున్నారు.
Somu Veerraju
ఏపీ రాజకీయాల్లో కూడా పార్టీకో ఛానల్ ఉంది. అవి బహిరంగంగానే తమ మద్దతును అవకాశం దొరికినప్పుడల్లా ఆయా పార్టీలకు ప్రకటిస్తూ ఉంటాయి. అయితే గత కొన్ని రోజులుగా ఏబీఆన్ న్యూస్ ఛానల్, పత్రికల యొక్క అధినేత రాధాకృష్ణ జగన్ ప్రభుత్వంపై కథనాలు రాస్తూ ఉన్నాడు. దాదాపు వైసీపీ ప్రభుత్వం తీసుకునే అన్ని నిర్ణయాలను తప్పు పడుతూనే ఉన్నారు. అయితే జగన్ మాత్రం ఈ కథనాలపై ఎప్పుడు స్పందించలేదు. కానీ రాధాకృష్ణ ఇప్పుడు బీజేపీపై పడ్డాడు. బీజేపీ రాష్ట్ర నేతలకు కూడా సలహాలు ఇస్తున్నారు. బీజేపీ నేత జీవీఎల్ పై కాసిన్ని సటైర్లుతో పాటు.. సలహాలు వేశారు. అలాంటి నేతను బీజేపీ అధినాయకత్వం కట్టడి చేస్తే మంచిదన్న సూచనను చెప్పారు. రాజకీయంగా ఏపీలో ఎదగాలని తపిస్తున్న సోముకు.. ఆర్కే వ్యాఖ్యలపై వెంటనే స్పందించారు.ఆయనపై విమర్శలు గుప్పిస్తూ ఓపెన్ లెటర్ రాశారు.

ఆ లెటర్ లో సోము రాస్తూ…” మీ పత్రికలో మీరు మీ అభిప్రాయాన్ని బహిరంగంగా చెప్పేశారు కాబట్టి.. స్పందనను సైతం నేను ఓపెన్ గానే చెప్పేయదలుచుకున్నా.. అన్యదా భవించొద్దు. ఈ రోజు ఆంధ్రజ్యోతిలో మీ సంపాదకీయం చదివాను. అందులో మా ఎంపీ జీవీఎల్ నరసంహారావు గారిని ఉద్దేశించి “మీ జీవీఎల్ మీ ఇష్టం” అనే శీర్షికతో విశ్లేషణ రాశారు. మా జీవీఎల్ గారు చంద్రబాబుగారిని విమర్శించడం మాకే మంచిది కాదు అని మీ అమోఘమైన విశ్లేషణ ద్వారా తెలిపారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్లో బలపడాలి అనుకుంటే జీవీఎల్ లాంటి వారిని మా నాయత్వమే కట్టడి చేయాలనీ సెలవిచ్చారు.
గతంలో అడ్డగోలుగా ప్రధాని మోదీ గారిని వారి కుటుంబాన్ని బీజేపీని టార్గెట్ చేసిన మీకు సడెన్గా బీజేపీపై ప్రేమ పుట్టిందని మేము ఆంధ్రప్రదేశ్లో ఎదగటం లేదని మీరు తెగ ఫీల్ అవుతున్నారని మీ విశ్లేషణ ద్వారా తెలిసింది. దీని వెనుక కొత్తగా బీజేపీ పైన పుట్టిన ప్రేమ కాదని ఇది పతనానికి చేరువలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని టీడీపీని రక్షించే ప్రయత్నమని ఇట్టే పిల్లలకు కూడా అర్థమైపోతుంది.
మీరు టీడీపీకి సలహాదారునిగా అనుకూలంగా పని చేస్తారని ప్రజల్లో వినికిడి. మరీ ఇంత పబ్లిక్గా నిర్లజ్జగా పత్రికను అడ్డం పెట్టుకుని మా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం తగునా చెప్పండి. మీ రాజకీయ సలహాలు చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఇవ్వండి. అసెంబ్లీలో టీడీపీ 23 స్థానాలకే పరిమితం అవడంలో మీ పాత్ర కూడా ప్రధానమా కాదా? అదే నిజమైతే మీరు ఇలాగే మీ సలహాలను టీడీపీకి కొనసాగిస్తూ పోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 23 నుండి రెండు లేక మూడు స్థానాలకు టీడీపీ పడిపోవడం ఖాయం.

మీరు మా జాతీయ నాయకత్వానికి మా నాయకులను ఎలా కట్టడి చేయాలో మా పార్టీని ఎలా కాపాడుకోవాలో సెలవిచ్చారు. ఈ విశ్లేషణ అసలు మతలబు ఏమిటో మీ అసలు తాపత్రయం ఏమిటో వారికి త్వరలోనే వివరిస్తాను. మీరేమి దిగులు పడవలసిన అవసరం లేదు. మీరు బహిరంగ విశ్లేషణ రాశారు కనుక మీకు లేఖను కూడా బహిరంగం గానే రాస్తున్నాను. అన్యధా భావించరని ఆశిస్తాను’ అని పేర్కొన్నారు. ఈ లేఖను బట్టి చూస్తే తమపై విమర్శలు చేస్తే అదే విధంగా ప్రతి విమర్శకు కూడా సిద్ధంగా ఉండాలని తాము సంకేతాలు పంపిస్తున్నట్టు బీజేపీ నేతలు చెప్తున్నారు. తమపై తప్పుడు వ్యాఖ్యలు చేసినా, విమర్శలు చేసినా బీజేపీ పార్టీ, వైసీపీ పార్టీలా చేస్తూ ఊరుకోదని, జగన్ లా సహించే గుణం తమకు లేదని బీజేపీ నేతలు ఈ లేఖ ద్వారా బహిరంగంగానే ప్రకటించారు