Biryani Leaves: దాదాపుగా మనం వండుకునే అన్ని మసాలా వంటలలో మనం ఉపయోగించే ఆకు బిర్యానీ ఆకు, ఇది అందరికీ తెలిసిన విషయమే ఈ ఆకు వంటింట్లో చాలా ముఖ్య ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతే కాకుండా ఈ ఆకును మలబార్ లీఫ్, ఇండియన్ కాసియా వంటి పేర్లతో కూడా పిలుస్తారు. ఈ ఆకు లారస్ నోబిలిస్ నుండి వచ్చిన ఒక అద్భుతమైన మూలిక. బిర్యానీ ఆకులు వంటలకు రుచిని ఇవ్వడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి.ముఖ్యంగా బిర్యాని ఆకుల వల్ల మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు.
ఈ బిర్యానీ ఆకు వివిధ ఔషధ గుణాలను కలిగి ఉంటుంది . అంతే కాకుండా ఈ ఆకులలో ఉన్నటువంటి టానిన్లు, ఫ్లేవనాయిడ్స్, అలాగే కీచైన్ వంటి ఫైటోకెమికల్స్ లాంటివి కూడా పుష్కలంగా ఇందులో లభిస్తాయి . అంతేకాకుండా ఈ బిర్యానీ ఆకులలో విటమిన్ ఏ, సి , ప్రొటీన్ ఐరన్,క్యాల్షియం పొటాషియం, మెగ్నీషియం, కాపర్,జింక్,సోడియం పాస్ఫరస్ ఇంకా కొన్ని విటమిన్లు మరియు ఖనిజాలు ఉన్నాయి. వీటి కారణంగా రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవచ్చు.
అంతేకాకుండా ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీ డయాబెటిక్ సమ్మేళనాల కారణంగా ఇది రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రించడంలో ఉంచుటకు ఉపయోగపడుతుంది. అంతే కాకుండా దీనిని టీగా కూడా మార్చుకొని త్రాగవచ్చు. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలోనూ, ఫంగల్ వంటి ఇన్ఫెక్షన్లను నియంత్రించడంలోనూ, జుట్టుకు సంబంధించిన చుండ్రులాంటి సమస్యలను నియంత్రించడంలోనూ, బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా వీటిని సరైన మోతాదులో తీసుకోవడం కూడ చాలా మంచిది.