Vijay Antony: పొలిటికల్ ఎంట్రీ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన విజయ్ ఆంటోనీ.. ఫేమ్ ఉంది కదా అని అలా చేయలేమంటూ!

Vijay Antony: తమిళ హీరో విజయ్ ఆంటోనీ గురించి మనందరికీ తెలిసిందే. విజయ్ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా బిక్షగాడు. ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు హీరో విజయ్ ఆంటోనీ. అంతేకాకుండా భారీగా అభిమానులను కూడా సంపాదించుకున్నారు. ఈ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన బిక్షగాడు 2 సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఈ సినిమాలతో పాటు ఆయన నటించిన కొన్ని సినిమాలు తెలుగులోకి డబ్బింగ్ అయిన విషయం తెలిసిందే. అలా తెలుగు తమిళ భాషల్లో బాగానే అభిమానులను సంపాదించుకున్నారు హీరో విజయ్ ఆంటోనీ.

ఇది ఇలా ఉంటే విజయ్ తాజాగా నటించిన లేటెస్ట్ మూవీ మార్గన్. ఈ సినిమాకు లియో జాన్ పాల్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమా రేపు అనగా జూన్ 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు విజయ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు పొలిటికల్ ఎంట్రీ పై కూడా స్పందించారు. పొలిటికల్ ఎంట్రీ గురించి హీరో విజయ్ మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు. నటీ నటులు ఏదో ఒక సమయంలో తప్పకుండా రాజకీయాల్లోకి అడుగుపెట్టాలనే రూల్‌ ఏమీ లేదు కదా.

సేవ చేయాలనే ఉద్దేశంతో ఎవరైనా అడుగుపెట్టినా వారికి పూర్తిస్థాయిలో ప్రజల మద్దతు ఉండి తీరాలి. అలా ఉన్నప్పుడే అధికారంలోకి రాగలరు. నిజం చెప్పాలంటే, నాకు రాజకీయాలపై పెద్దగా అవగాహన లేదు. ఫేమ్‌ ఉందని రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి లేదు. ముందు ప్రజల సమస్యలను అర్థం చేసుకోగలగాలి అని విజయ్‌ ఆంటోనీ అన్నారు. ఈ సందర్భంగా విజయ్ ఆంటోనీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ విషయంతో పాటు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారిన నటుడు శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్ విషయం గురించి కూడా స్పందించారు. సినీ పరిశ్రమలో డ్రగ్స్‌ వాడకం కొత్తేమీ కాదు. ఎంతోకాలంగా చిత్ర పరిశ్రమలో ఈ సమస్య ఉంది. మత్తు పదార్థాలకు చాలామంది బానిసలవుతున్నారు. శ్రీకాంత్‌ కు సంబంధించిన కేసు దర్యాప్తులో ఉంది. దీనిలో నిజానిజాలు త్వరలోనే బయటపడతాయి అని తెలిపారు విజయ్ ఆంటోనీ.