Colors Swathi : ఓ టీవీ షో పేరునే తన ఇంటి పేరుగా మార్చేసుకున్న అందాల భామ స్వాతి రెడ్డి. టెలివిజన్‌లో యాంకర్‌గా ‘కలర్స్’ షో ద్వారా పాపులర్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఆ పాపులారిటీతోనే కలర్స్ స్వాతిగా బుల్లితెర నుండి పెద్ద తెరకు ప్రమోట్ అయ్యింది.
ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించిన ‘అష్టాచెమ్మా’ సినిమాతో బిగ్ స్ర్కీన్‌పైకి అడుగు పెట్టిన కలర్స్ స్వాతి, హీరోయిన్‌గా తనదైన స్టయిల్ నటనను ప్రదర్శించింది. ‘స్వామి రారా’, ‘ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే..’ తదితర సినిమాల్లో నటించింది. ప్లే బ్యాక్ సింగర్‌గానూ అప్పుడప్పుడూ తన టాలెంట్‌కి పని చెప్పింది.
అయితే, ఆ తర్వాత వరుస ఫెయిల్యూర్లు కలర్స్ స్వాతిని ఇబ్బంది పెట్టడంతో తెలుగు తెరకు బై బై చెప్పేసి తమిళ నాట స్థిరపడింది. హీరోయిన్‌గా అక్కడ ఓ మోస్తరు స్టార్‌డమ్ అందుకుంది. ఓవరాల్‌గా తెలుగులో కన్నా, తమిళంలోనే స్వాతి సక్సెస్ అయ్యిందని చెప్పొచ్చు. అయితే, కలర్స్ స్వాతి తెలుగులో అంతగా సక్సెస్ కాకపోవడానికి కొన్ని చిదంబర రహస్యాలున్నాయటండోయ్.
సహజంగా హీరోయిన్లు తెలుగు వచ్చినా రానట్లుగా నటిస్తారు. ముద్దు ముద్దుగా వచ్చీ రాని తెలుగు మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారు. కానీ, అలా తెలుగు వచ్చి కూడా రానట్లు నటించడం ఆమెకు చేతకాలేదట. అదే ఆమె ఫెయిల్యూర్‌కి ఓ కారణమంటోంది కలర్స్ స్వాతి. అంతేకాదు, సెట్స్‌లో కొందరు వేసిన జోక్స్ అర్ధమయ్యి కూడా అర్ధమవ్వనట్లుగా ఫీలై లైట్ తీసుకున్నట్లుగా నటించడం కూడా ఆమెకు చేతకాలేదట.
ఆయా కారణాలే ఆమెను తెలుగు తెరపై ఫెయిల్ అయ్యేలా చేశాయంటోంది కలర్స్ స్వాతి. ఆ కిటుకులు తెలిసిన వేరే భాషా హీరోయిన్లు ఇక్కడ సక్సెస్ అయ్యారనీ కలర్స్ స్వాతి కుండ బద్దలుకొట్టేసింది. ఏంటి నిజమే.. ఆ మాత్రం లౌక్యం కలర్స్ స్వాతికి తెలియలేదా.? అబ్బో.!