నందమూరి తారకరత్న తెలుగు సినిమా నటుడు. ఈయన స్వర్గీయ నందమూరి తారక రామారావు వారసుడైన మోహన్ కృష్ణకు 1983లో జన్మించాడు. ఇక 2002లో ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సొంతం చేసుకుంది. మొదటి సినిమానే హిట్ కావడంతో మంచి గుర్తింపు వచ్చింది.
ఇక టాలీవుడ్ లో మంచి పర్సనాలిటీ, మంచి హైట్ ఉంది. ఇక స్టార్ హీరోగా ఎదుగుతాడు. మొదటి సినిమాతోనే సక్సెస్ను పొందాడు అని అందరూ అనుకున్నారు. దాదాపు 20 సినిమాలలో నటించిన ఈయనకు కెరీర్లో బెస్ట్ సినిమా అంటే ఒకటో నెంబర్ కుర్రాడు అని చెప్పుకోవాలి. ఇక 2009లో విడుదలైన అమరావతి సినిమాలో విలన్ గా నటించి మెప్పించాడు.
అమరావతి చిత్రం ద్వారా ఉత్తమ విలన్ గా నంది అవార్డును తీసుకున్నాడు. ఇక కాలేజీలో తన జూనియర్ కు అక్క ఆయన అలేఖ్య రెడ్డితో పరిచయం ఏర్పడింది. ఈమెకు ఇంతకుముందే పెళ్లి అయ్యి విడాకులు తీసుకుంది. ఈమె కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తూ వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది.
వీరి వివాహానికి కుటుంబ పెద్దలు అనుమతించక హైదరాబాద్లోని సంఘీ టెంపుల్లో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి స్నేహితులతో పాటు, అలేఖ్య సోదరులు వివాహానికి హాజరయ్యారు. కులాంతర వివాహం కాబట్టి పెద్దలు అంగీకరించలేదు. అలేఖ్య తండ్రి ఒక రిటైర్డ్ ఆర్డిఓ. ఈమె స్వస్థలం అనంతపురం. వీరికి ఒక పాప సంతానం.
కొంతకాలం కుటుంబ సభ్యులతో మాటలు లేవు. ఈమధ్య ఇరు కుటుంబాలకు మధ్య రాకపోకలు జరుగుతున్నాయి. ఇక తాజాగా మహేష్ బాబు తో ఒక సినిమాలో నటిస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో ఏ పాత్రలో కనిపించి ప్రేక్షకుల మెప్పు పొందుతారో చూడాల్సిందే.