నాని ఒక భారతీయ నటుడు, నిర్మాత. తెలుగు సినిమాల ద్వారా బాగా ప్రసిద్ధి చెందాడు. 1984లో హైదరాబాద్ లో జన్మించాడు. ఐదేళ్ల ప్రేమాయణం తర్వాత 2012లో నాని, అంజనాను వివాహం చేసుకున్నాడు. వారి కుమారుడు అర్జున్ 2017లో జన్మించాడు. చిన్నప్పటినుండి నటనపై ఆసక్తి ఉండడంతో హీరో కావాలనుకున్నాడు.
కానీ డిగ్రీ చదివే రోజుల్లో తనకు సినీ బ్యాక్ గ్రౌండ్ లేదని, తనను రేకమండేషన్ చేసే వాళ్ళు కూడా ఎవరూ లేరని, తను హీరో కావాలంటే హైట్ కూడా ప్రాబ్లం అవుతుందేమో అని డైరెక్టర్ కు మాత్రం టాలెంట్ ఉంటే సరిపోతుంది కదా అని డైరెక్టర్ కావాలనుకున్నాడు. తాను డిగ్రీ సెకండ్ ఇయర్ చదివే సమయంలో ఒక ప్రొడక్షన్ ఆఫీసుకు వెళితే అక్కడి మేనేజర్ ఉదయం నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేయించాడట.
ఇలా ఎన్నో తన జీవితంలో ఉన్నాయని ఒక ఇంటర్వ్యూలో భాగంగా పేర్కొనడం జరిగింది. చివరకు నిర్మాత అనిల్, దర్శకుడు బాపుతో కలిసి క్లాప్ డైరెక్టర్ గా తన సినిమా రాధాగోపాలం కి పనిచేయటానికి నానికి అనుమతి ఇచ్చాడు. ఆ తరువాత అల్లరి బుల్లోడు, ఢీ, అస్త్రం వంటి చిత్రాలకు పనిచేశాడు. వరల్డ్ శాటిలైట్ స్పేస్ రేడియో జాకీగా పనిచేస్తున్న తన స్నేహితురాలు నానీ కు ఆర్జేగా వర్క్ ఇచ్చింది.
అలా సంవత్సరం పాటు పనిచేసిన తర్వాత మోహన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన అష్టాచమ్మాలో ఒక పాత్రలో నటించే అవకాశం కల్పించాడు. తర్వాత రైడ్, స్నేహితుడా, భీమిలి కబడ్డీ జట్టు లాంటి సినిమాలతో తన కెరీర్ ను ప్రారంభించి 2011లో అలా మొదలైంది సినిమా ద్వారా మంచి గుర్తింపు ప్రశంసలు పొందాడు. తర్వాత వచ్చిన ఈగ కూడా మంచి సక్సెస్ ని సొంతం చేసుకుంది.
గతంలో ఒక ఇంటర్వ్యూలో చాలా సేపు వెయిట్ చేయించిన మేనేజర్ హీరో అయ్యాక అదే ఆఫీసుకు వెళ్తే దగ్గరుండి అన్ని చూసుకుంటే ఆ కిక్కు మామూలుగా ఉండదు అని మీడియాతో పంచుకున్నాడు. ఇటీవలే విడుదలైన అంటే సుందరానికి సినిమా కూడా మంచి విజయం సొంతం చేసుకుంది. ప్రస్తుతము ఒక సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నట్టు సమాచారం.