Health Tips: దేశంలో ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఆరోగ్యసమస్యల లో టీబీ (క్షయ) వ్యాది కూడా ఒకటి. కరోనా, పోలియో వంటి వాటిని అంతం చేసిన శాస్త్రవేత్తలు ప్లీజ్ మహమ్మారిని అంతం చేయలేకపోతున్నారు. WHO వెల్లడించిన నివేదిక భారతదేశంలోని అధిక మొత్తంలో క్షయ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. భారత దేశంలో ప్రతి సంవత్సరం 48000 మంది టీబీ వ్యాధితో మరణిస్తున్నారు.ఈ మహమ్మారి కి అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఈ వ్యాధి కట్టడం ఎవరితరం కాలేకపోతోంది.
ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, బీహార్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో మధ్య టీబీ వ్యాది తీవ్రత ఎక్కువగా ఉంది. 2023 నాటికల్లా టీబీ వ్యాధి ని పూర్తిగా అంతం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ అది సాధ్యపడని విషయం అని కొందరు నిపుణులు తెలుపుతున్నారు. టీబీ వ్యాధి బారిన పడిన వారికి ప్రభుత్వం తరఫున ఉచితంగా మందులు ఆహారం పంపిణీ చేస్తున్నారు.
సాధారణంగా క్షయ వ్యాధి జలుబు, దగ్గు, తుమ్ములు వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. దీర్ఘకాలికంగా ఈ లక్షణాలు ఉంటే వైద్యుని సంప్రదించి పరీక్షలు చేయించుకోవటం చాలా అవసరం. ఈ వ్యాధి సోకినప్పుడు విపరీతమైన దగ్గు , జ్వరం తలనొప్పి వంటి లక్షణాలు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి . ఆకలి మందగించటం, నీరసం, అలసట, బరువు తగ్గటం వంటివి కూడా ఈ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి ఒకరి నుండి మరొకరికి సోకుతుంది. వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.
షుగర్ వ్యాధితో బాధ పడేవారు, పోషకాహార లోపం ఉన్నవారు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు, కరోనా బారిన పడిన వారు, క్యాన్సర్ రోగులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల్లో ఈ వ్యాధి తొందరగా వ్యాపించే అవకాశం ఉంటుంది. ఈ టీబీ సంబంధించిన బ్యాక్టీరియా శరీరంలో చేరిన రెండు సంవత్సరాల కొందరిలో తర్వాత ఈ వ్యాధి లక్షణాలు బయట పడతాయి, మరికొందరిలో ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఈ లక్షణాలు బయటపడతాయి. ఎవరైనా ఈ లక్షణాలతో ఉన్నట్లయితే వెంటనే డాక్టర్ని సంప్రదించి చికిత్స తీసుకోవడం చాలా అవసరం.