Seasonal Fruits: వేసవిలో దొరికే సీజనల్ ఫ్రూట్స్ వల్ల ఉపయోగాలెన్నో..!

Seasonal Fruits: సీజనల్ ఫ్రూట్స్ ను మనం చాలా ఇష్టపడతాం. ఒక నిర్దష్ట కాలంలో మాత్రమే దొరికే పండ్లను ఎవరు వదులుకోవడానికి ఇష్టపడతారు. ఇంకా చెప్పాలంటే ఆ పండ్ల కోసం ఎదురుచూస్తూ ఉంటాం. వీటివల్ల మంచి ఆరోగ్యం, పోషకాలు లభిస్తాయి.. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది వేసవిలో దొరికే పండ్లలో మామిడి, పుచ్చకాయలు, తాటి ముంజలు, జంబు పండు, బ్లాక్ ప్లమ్ ఉన్నాయి. జంబు పండ్లు తెల్లగా, నల్లగా కూడా ఉంటాయి. బంబు పండ్లను వ్యాక్స్ ఆపిల్, వాటర్ ఆపిల్ అని కూడా అంటారు. దీనిలో ఉండే నీటి శాతం వల్లే ఆ పేరు. ఇవి వేసవిలోనే దొరుకుతాయి.

 

ఆయుర్వేదం, యునాని, చైనీస్ మందుల్లో ఈ పండ్లను ఉపయోగిస్తారు. అజీర్తి, డయాబెటిస్, గొంతు ఇన్ఫెక్షన్స్, రెస్పిరేటరీ, పిత్త సమస్యలను తగ్గిస్తాయి. ఈ పండ్లలోని గింజల్లో క్యాల్షియం, ప్రోటీన్స్ ఉంటాయని ఆహార నిపుణులు అంటున్నారు. రాక్ సాల్ట్ తయారు చేయడంలో కూడా వీటిని ఉపయోగిస్తారని అంటున్నారు. ఈ పండ్లను వేరే సిట్రస్ ఫ్రూట్స్ తో సలాడ్ కూడా చేసుకోవచ్చని అంటున్నారు. వీటిలో ఉండే నీటి శాతం ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆహార నిపుణులు అంటున్నారు.

పుచ్చకాయల్లో వాటర్ కంటెంట్ ఎక్కువ. ఎండ వేడిని తట్టుకునేలా చేస్తాయి. రక్తపోటు గుండెపోటు సమస్యల నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి. పుచ్చకాయ తీసుకోవడం వల్ల క్యాన్సర్ వ్యాధిని దూరం చేయొచ్చని అంటున్నారు. గర్భిణులలు పుచ్చకాయ ముక్కలు తింటే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. విరోచనాలు, కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, కిడ్నీలో రాళ్లు, మల బద్ధకం సమస్యలను తగ్గిస్తుంది. అయితే.. పుచ్చకాయ గట్టిగా ఉండాలి.. ఫ్రిజ్ లో పెట్టకూడదు.. రెండు గంటల కంటే ముక్కలు ఎక్కువ నిల్వ ఉండకూడదు.

తాటి ముంజలు కూడా వాటర్ కంటెంట్ ఉన్నవే. ఎండ వేడిని తట్టుకునేలా, డీహైడ్రేషన్ కు గురి కాకుండా చేస్తుంది. తాటిముంజల్లో యాంటీ ఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు, విటమిన్ ఏ, విటమిన్ సి, బి కాంప్లెక్స్ ఉంటాయి. వీటిలో ఉండే జింక్, ఐరన్, సాల్ట్ ఎలక్ట్రోలైట్స్ ని కంట్రోల్ చేస్తాయి. పొటాషియం కాలేయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఫైటో కెమికల్స్ వృద్ధాప్యం త్వరగా రాకుండా చేస్తుంది.

 

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో ఆహార నిపుణులు, వైద్యులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించడమే ఉత్తం. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.