Chiranjeevi: కమెడియన్ అలీ దంపతులకు సర్ప్రైజ్ గిఫ్ట్ పంపిన మెగాస్టార్.. నెట్టింట వీడియో వైరల్!

Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఎంతోమంది అభిమానులు ఉన్నారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. కేవలం సామాన్య వ్యక్తులు మాత్రమే కాకుండా కొంతమంది హీరో హీరోయిన్లు సెలబ్రిటీలు కూడా మెగాస్టార్ చిరంజీవికి అభిమానులే అన్న విషయం తెలిసిందే. అలా మెగాస్టార్ ను అమితంగా అభిమానించే నటులలో ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ అలీ కూడా ఒకరు. చిరంజీవికి కూడా అలీ అంటే చాలా ఇష్టం. అందుకే అలీతో పాటు కమెడియన్ బ్రహ్మానందానికి కూడా ప్రతి ఏడాది కొన్ని మామిడిపండ్లను పంపిస్తూ ఉంటారట మెగాస్టార్ చిరంజీవి.

తన ఫామ్ హౌస్ లో పండిన మామిడి పండ్లను ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా పంపించారట. అయితే మెగాస్టార్ చిరంజీవి పంపించిన ఆ సర్ప్రైజ్ గిఫ్ట్స్ చూసిన అలీ దంపతులు మురిసిపోయారు. కానీ ఈ సారి మామిడి పండ్లతో పాటు మరికొన్ని ప్రత్యేక బహుమతులు వచ్చాయి. అవే అత్తమ్మాస్ కిచెన్ వంటకాలు. ఆవకాయ పచ్చడి, ఉప్మా, పులిహోర, కేసరి, రసం, పొంగల్‌ తదితర రెడీ టు మిక్స్‌ పొడులను అలీ దంపతులకు పంపించారు చిరంజీవి,సురేఖ. వీటిని సపరేట్ గా ప్యాక్ చేసి మరీ అలీ ఇంటికి పంపారు చిరు. వీటిని అలీతో భార్య అతని భార్య జుబేదా తెగ సంబరపడిపోయారు.

మెగాస్టార్ చిరంజీవి అన్న తమకోసం వీటిని ప్రేమగా పంపారని పేర్కొంటూ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో షేర్‌ చేసారు. అయితే వాటిని చూపిస్తూ అలీ దంపతులు మురిసిపోయిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియో చూసిన అభిమానులు క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. అయితే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి అత్తమ్మ కిచెన్ లోని కొన్ని పచ్చళ్ళు వెళ్లిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ఆయన తెలుపుతూ ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ కూడా చేశారు.