చియా, సబ్జా గింజల్లో తేడాలు ఇవి..! వీటివల్ల లాభాలు అవి..!!

ప్రస్తుతం ఎండాకాలం నడుస్తోంది. మన శరీరం వేడిని తట్టుకునేందుకు అనేక పండ్లు, జ్యూసులు, కొబ్బరిబొండాలు, పుచ్చకాయలు, తాటి ముంజలు, మజ్జిగ.. ఇలా అనేక పద్ధతులు పాటిస్తూ చల్లదనాన్ని తెచ్చుకుంటున్నాం. అయితే.. వీటితోపాటు కొన్ని గింజల ద్వారా కూడా బాడీ కూల్ చేసుకోవచ్చు. తద్వారా శరీరంలో వేడి తగ్గించుకోవచ్చు. అవే.. చియా గింజలు, సబ్జా గింజలు. చియా గింజలు మెక్సికోలో పుట్టాయి. సబ్జా గింజలు భారత్ లో పుట్టాయి. వీటిల్లో ఉండే ప్రొటీన్లు, పోషకాలు శరీరానికి చల్లదనంతోపాటు ఆరోగ్యాన్ని ఇస్తాయి. అయితే.. ఈరెండు ఒకే రకంగా ఉండి కాస్త కన్ఫ్యూజ్ చేస్తాయి.

Cs 1 | Telugu Rajyam

చియా గింజల్లో ప్రొటీన్లు, ఒమేగా 3 ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మనకు శక్తిని ఇస్తాయి. షుగర్ లెవల్స్ ను కంట్రోల్ లో ఉంచుతాయి. బరువు తగ్గేందుకు సహకరిస్తాయి. సబ్జా గింజలు శరీరాన్ని చల్లబరుస్తాయి. ఇవి మనలోని ఎసిడిటీ తగ్గిస్తాయి. జుట్టు రాలకుండా ఆపుతాయి. జీర్ణ సమస్యలను తొలగిస్తాయి. శరీరాన్ని డీటాక్సిఫై చేస్తాయి. సబ్జ గింజలు నలుపు రంగులో ఉంటే.. చియా గింజలు బూడిద, తెలుపు, నలుపు రంగుల్లో ఉంటాయి. చియా గింజలు గుండ్రంగా ఉంటే.. సబ్జా గింజలు అండాకారంలో కొద్దిగా పెద్దవిగా ఉంటాయి.

చియా గింజలు నీటిలో నానటానికి టైమ్ ఎక్కువగా తీసుకుంటాయి. సబ్జ గింజలు నీటిలో వేసిన వెంటనే నానిపోతాయి. చియా గింజలు నీటిలో నానిన తర్వాత పది రెట్ల బరువు పెరిగి నీటి అడుక్కి చేరుకుంటాయి. కాస్త జిగిరుగా ఉంటాయి. సబ్జ గింజలు నానిన తర్వాత ఉబ్బిపోయి నీటిలో తేలతాయి. వీటిని నీటిలో గంటపాటు నానబెట్టిన తర్వాత నీటిలో వేసుకుని తాగొచ్చు.. మిల్క్ షేక్స్ లో కలుపుకుని తాగొచ్చు.

సబ్జ గింజలను ఎండాకాలంలో నిమ్మరసం, సుగంధి లాంటి డ్రింక్స్ లో వేసుకొని తాగడం వల్ల రుచి పెరగడమే కాదు.. శరీరానికి చలవ చేస్తుంది. చియా గింజలను అలాగే తినొచ్చు.. కానీ సబ్జ గింజలను నానబెట్టిన తర్వాతే తినాలి. రెండూ మంచి పోషకాలు ఇస్తాయి. చియా గింజలను తీసుకోవడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుంది. లంచ్ కి అరగంట ముందు తీసుకుంటే ఉపయోగం. తక్కువ తింటాం. 

 

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో ఆహార నిపుణులు, వైద్యులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించడమే ఉత్తమం. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.

 

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles