Health Tips: ప్రకృతిలో లభించే అనేక రకాల మొక్కలు మన శరీర ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. అటువంటి వాటిలో ఒకటి తిప్పతీగ. పట్టణాలలో నివసించే వారికి దీని గురించి ఎక్కువగా అవగాహన లేకపోయినా… పల్లెటూర్లలో నివసించేవారికి ఇది ప్రతి చోటా కనిపిస్తుంది. ఇంటి ముందు వేసినా కూడా ఇది చెట్లకు అల్లుకుపోతుంది. తిప్పతీగను సంస్కృతంలో అమృత్ అని, ఇంగ్లీషులో గిలోయ్ అని పిలుస్తారు. తిప్పతీగ లో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. వీటిని మెడిసిన్స్ తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఆయుర్వేద పరంగా కూడా తిప్పతీగను వినియోగిస్తారు. తిప్పతీగను జ్యూస్, పౌడర్, క్యాప్సూల్స్ చేసి మార్కెట్లో విక్రయిస్తారు. తిప్పతీగ ఆకులను రోజుకు రెండు తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తిని బాగా పెంచి ఎక్కువ వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది.
• జీర్ణ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు తిప్పతీగ యొక్క ఆకుల పొడిని బెల్లం లో కలుపుకొని తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడి, అజీర్తి సమస్యలు తగ్గుతాయి.
• సీజనల్ వ్యాధులు అయిన డెంగ్యూ, మలేరియా, స్వైన్ ఫ్లూ వంటి వ్యాధుల నుండి కాపాడగల శక్తి తిప్పతీగ లో ఉంది.
• సాధారణంగా వయసు పై పడటం వల్ల కీళ్ల నొప్పులు వేధిస్తుంటాయి. తిప్పతీగ పొడిని గోరువెచ్చని పాలలో కలుపుకొని తాగితే కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.
• మీ చర్మ సౌందర్యాన్ని కాపాడటం లోనూ తిప్పతీగ కీలక పాత్ర పోషిస్తుంది. ముఖం పై మచ్చలు, మొటిమలు, వృద్ధాప్య సమస్యల నుండి కాపాడగల శక్తి ఇందులో ఉంది.
• డయాబెటిక్ సమస్యలు ఉన్నవారు తిప్పతీగ చూర్ణం ప్రతి రోజు ఉదయం, సాయంత్రం తీసుకుంటే షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచుకోవచ్చు.
• ఒత్తిడి, మానసిక సమస్యలతో సతమతమయ్యేవారు రోజు ఈ చూర్ణాన్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
• రోజు తిప్పతీగ ను తీసుకోవడం వల్ల అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించి, శరీరానికి సూక్ష్మజీవుల వల్ల కలిగే అనర్థాలను తగ్గిస్తుంది.