Keerthy Suresh: బాలీవుడ్ హీరోయిన్ వరుణ్ ధావన్,కీర్తి సురేష్ కలిసి నటించిన చిత్రం బేబీ జాన్. డైరెక్టర్ అట్లీ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా ఇటీవలే క్రిస్మస్ పండుగ కానుకగా డిసెంబర్ 25న విడుదల అయిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా మిక్స్డ్ టాక్ ని తెచ్చుకుంది. అయితే ఈ సినిమా విడుదలకు 20 రోజుల ముందే ఒక్క హిందీలోనే పుష్ప 2 ప్రాజెక్ట్ రూ.700 కోట్లకు పైగా వసూలు చేసింది. అదే సమయంలో విడుదలైన బేబీ జాన్ మాత్రం ప్రేక్షకులను దారుణంగా నిరాశపరిచింది. ఈ చిత్రం ఇప్పటి వరకు దాదాపు రూ.43 కోట్లు మాత్రమే వసూలు చేసినట్లు సమాచారం.
కాగా దాదాపు రూ.160 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఇప్పటి వరకు కేవలం 43 కోట్ల రూపాయలను మాత్రమే వసూలు చేసిందటీ. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ సినిమాకు కీర్తి పేరును ఒక టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రికమెండ్ చేసారట. అయితే ఇదే విషయాన్ని కీర్తి స్వయంగా వెల్లడించింది. ఆమె మరెవరో కాదు టాప్ హీరోయిన్ సమంత. ఈ సినిమాకు తన పేరును చెప్పింది సమంత అని వరుణ్ ధావన్ తనతో అన్నారని ఇటీవల కీర్తి చెప్పుకొచ్చింది. సమంత తమిళంలో నటించిన చిత్రాల్లో థేరి అంటే తనకు చాలా ఇష్టమని హిందీలో ఆ పాత్ర పోషించేందుకు చాలా భయపడ్డానని చెప్పుకొచ్చింది.
థేరి చిత్రాన్ని తమిళంలో డైరెక్టర్ అట్లీ తెరకెక్కించారు. ఇందులో సమంత, అమీ జాక్సన్, విజయ్ దళపతి ప్రధాన పాత్రలు పోషించారు. రాధిక శరత్ కుమార్ కీలకపాత్ర పోషించగా.. 2016లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అప్పట్లో ఈ మూవీ రూ.125 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక ఇదే సినిమాను హిందీలో రీమేక్ చేయగా కేవలం రూ.43 కోట్లు రాబట్టింది. ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను కూడా బాగానే చేసినప్పటికీ ఎందుకు ఈ సినిమా సక్సెస్ కాలేకపోయింది.