Beauty tips: చర్మం కందిపోతుందా..? ఇంట్లోనే ఫేస్ ప్యాక్స్ చేసి అందం పొందొచ్చు..!

Beauty tips: వేసవి వచ్చిందంటే చర్మం పాడవడం జరుగుతుంది. ఇప్పుడంటే కరోనా రోజులు కాబట్టి ఎండల్లో బయటకు వెళ్లడం తగ్గింది. లాక్ డౌన్ పరిస్థితులు చక్కబడ్డాక బయటకు పనుల మీద బయటకు వెళ్లాల్సిందే. పైగా.. వర్షా కాలం, శీతాకాలం వస్తున్నాయన్న పేరే కానీ.. పగటి ఎండల్లో తేడా ఉండటం లేదు. ఈక్రమంలో మన చర్మం పాడవడటం సహజం. అయితే.. వేసవిలోనే చర్మం కందిపోతుంది. కాబట్టి ఇంట్లోనే ఫేస్ ప్యాక్ తయారు చేసి రాసుకుంటే చర్మం ముఖం అందంగా కనపడుతుంది.

 బయటకు వెళ్లి ఫేస్ ప్యాక్ లకు పెట్టకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు. వేసవిలో విరివిగా దొరికే పుచ్చకాయ తిన్నా, జ్యూస్ తాగినా మన శరీరం కూల్ గా ఉంటుంది. పెరుగు చల్లదనాన్ని ఇస్తుంది. వీటితో ఓ ఫేస్ ప్యాక్ చేసుకోవచ్చు. పుచ్చకాయ ముక్కలు కొన్నింటిని తీసుకుని పెరుగును కొంత కలిపి మిక్సీలో వేయాలి. ఆ మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్‌లా వేసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. అప్పుడు మొహం కాంతివంతంగా ఉంటుంది.

 

నిమ్మలో జిడ్డు తొలగించే గుణం ఉంటుంది. కాబట్టి ముఖంపై ఉండే జిడ్డును కూడా నిమ్మ తొలగిస్తుంది. కలబంద చర్మానికి అవసరమైన తేమను అందించి మృదువుగా ఉంచుతుంది. కలబంద గుజ్జును కొంత తీసుకొని దానిలో నిమ్మరసం కలపాలి. ఇదే ఫేస్ ప్యాక్‌లా ఉపయోగపడుతుంది. దీనిని ముఖంపై అప్లై చేస్తే చర్మం మృదువుగా మారుతుంది.

 

పుదీనా ఆకు, ముల్తానీ మట్టి మిశ్రమం కూడా చర్మం కాంతులీనేలా చేస్తుంది. ఈ రెండింటినీ మిక్సీలో పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్ ను ముఖంపై పెట్టుకుని ఇరవై నిమిషాల తర్వాత కడిగితే ముఖం కాంతులీనుతుంది. తేనె, దోసకాయ కూడా చర్మం కాంతులీనేలా చేస్తుంది. టేబుల్ స్పూన్ తేనె, దోసకాయ ముక్కల్ని కలిపి మిశ్రమంలా చేయాలి. దీనిని ముఖంపై పట్టించి అరగంట తర్వాత కడిగినా ఫలితం ఉంటుంది.

 

గంధం, రోజ్ వాటర్ మిశ్రమం చర్మాన్ని తాజాగా ఉంచుంది. రెండు టీ స్పూన్‌ల గంధపు పొడిలో కొంచెం రోజ్ వాటర్ పోసి ఫేస్ ప్యాక్ లా చేసుకోవాలి. ముఖంపై పట్టించిన తర్వాత పూర్తిగా ఎండిపోయే వరకూ ఉంచి.. తర్వాత కడిగితే చర్మం మెరిసేలా చేస్తుంది.

 

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో నిపుణులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను, చర్మ సౌందర్య నిపుణులను సంప్రదించడమే ఉత్తమం. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.