Beauty Tips: శీతాకాలంలో అందరిలో కనిపించే సమస్యలలో ఎక్కువగా అరికాళ్ళు ,మడమలు ,
పాదాలు పగుళ్ళు , చర్మం పొడిబారడం , దురద వంటి సమస్యలు మనం చూస్తుంటాము. మనిషి శరీరంలోని అన్ని బాగాల మీద చాలా శ్రద్ధ చూపుతాడు , కానీ పాదాల శుభ్రత మీద ఎటువంటి శ్రద్ధ చూపరు.. శరీరం మొత్తం బాగా చూసుకునేవారు శరీరం బరువుని మోసే పాదాలు ఏం పాపం చేశాయని వాటిని పట్టించుకోరు. కాళ్ల పగుళ్ళు నివారణకు మార్కెట్ లో చాలా రకాల మందుల దొరుకుతాయి. వేడి చేసే ఆహారం తినడం లేదా తాగడం వలన కూడా పాదాలకు పగుళ్ళు ఏర్పడవచ్చును. చాలా మందికి పగుళ్ళు వలన చాలా నొప్పి, రక్త స్రావం కూడా జరుగుతుంటుంది. ఈ సమస్యకి మన ఇంటిలో ఉన్న పదార్ధాలతో చెక్ పెట్టవచ్చును. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
వెన్నపూస: రాత్రి పడుకునే ముందు వెన్నపూస తీసుకొని దానిని పగుళ్ళు ఏర్పడిన చోట రాసి 5 నిమిషాలు బాగా మర్దన చేసి 10 నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయటం వల్ల కాళ్లు పగుళ్ళ సమస్య క్రమేపీ తగ్గుముఖం పడుతుంది .
కొబ్బరి నూనె: రాత్రి పడుకునే ముందు కొబ్బరినూనె తీసుకొని దానితో పగుళ్ళు ఏర్పడిన చోట మర్దన చేయడం వలన మీ పాదాల పగుళ్లు తగ్గించుకోవచ్చు.
పసుపు: మహిళలు ఏదైనా ఫంక్షన్ ఉన్న, పేరంటాలు ఉన్న పసుపు పుసుకోవడం ఆనవాయితీ. మీ పాదాల పగుళ్ల నివారణకు పసుపు , పెరుగు కలిపిన మిశ్రమాన్ని వారానికి రెండుసార్లు పగుళ్ళ మీద రాయటం వల్ల తేడా గమనించవచ్చు.
తేనె: 100 గ్రాముల ఉప్పు తీసుకుని అందులో కొంచెం తేనె కలిపి… ఈ మిశ్రమంతో పగుళ్ల మీద మసాజ్ చేసినట్టయితే మంచి ఫలితం ఉంటుంది.
లాంతర్న్ నూనె: లాంతరు నూనె, కొబ్బరి నూనె రెండు సరైన మోతాదులో తీసుకొని అందులో కొద్దిగా పసుపు పొడి మిక్స్ చేసి పేస్ట్ నీ పగుళ్ల మీద అంటించడం ద్వారా పగుళ్ల సమస్య తగ్గిపోతుంది.
గోరింటాకు: గోరింటాకు తీసుకొని దానిని పేస్ట్ లాగా చేసి పగుళ్ళు ఉన్న చోట పాదాలకు రాయటం వల్ల కాళ్లు పగుళ్ళు సమస్య తగ్గుముఖం పడుతుంది.ఇకెందుకు ఆలస్యం ఈ చిన్న చిన్న చిట్కాలు మిమ్మల్ని ఆరోగ్యవంతులు చేస్తాయి. పగుళ్ళు ఎక్కువ ఉన్నవారు పైన తెలిపిన విధంగా ఈ ఇంటి చిట్కాలు పాటించడం వల్ల కాళ్లు పగుళ్ళు సమస్య దూరం చేయవచ్చు.