Beauty Tips: బ్లాక్ హెడ్స్ తో బాధపడుతున్నారా… ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!

Beauty Tips: అందంగా కనిపించాలనే ప్రతి ఒక్క అమ్మాయి అబ్బాయి ఎంతో ఆశపడుతుంటారు.ఈ క్రమంలోనే వారి అందాన్ని పెంపొందించుకోవడంలో కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలా ఈ ప్రయత్నంలో భాగంగానే బ్యూటీపార్లర్ కి వెళ్లడం మార్కెట్లో దొరికే సౌందర్య ఉత్పత్తులను ఉపయోగించడం చేస్తుంటారు.ఇలా ఎన్ని చేస్తున్నప్పటికీ కొందరికి మాత్రం బ్లాక్ హెడ్స్ అందవిహీనంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ బ్లాక్ హెడ్స్ ను తొలగించుకోవాలంటే ఇంటిలో దొరికే కొన్ని వస్తువులతో సింపుల్ చిట్కాలను పాటిస్తే బ్లాక్ హెడ్స్ కు చెక్ పెట్టవచ్చు. మరి ఈ సింపుల్ చిట్కాలు ఏమిటి ఇక్కడ తెలుసుకుందాం…

బ్లాక్ హెడ్స్ ను తొలగించుకోవడానికి బేకింగ్ సోడా బాగా పనిచేస్తుంది. బేకింగ్ సోడా పేస్ట్ ని బ్లాక్ హెడ్స్ ఉన్న దగ్గర రాసుకోవాలి, రెండు నిమిషాల తర్వాత మృదువుగా వృత్తాకారంలో మర్దన చేసుకొని గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ తో పాటు మృత చర్మం ముఖంపై పేరుకున్న మురికి తొలగిపోతుంది.

బ్లాక్ హెడ్స్ ను ఓట్ మీల్ తో కూడా తొలగించుకోవచ్చు.ఓట్స్ మిక్సీలో వేసుకుని పౌడర్ లా చేసుకొనిదానిని బ్లాక్ హెడ్స్ ఉన్న దగ్గర రుద్దడం వలన బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి. బ్లాక్ హెడ్స్ తొలగించడానికి మరొక విధానం ఆలివ్ ఆయిల్ షుగర్ స్క్రబ్. ఆలివ్ ఆయిల్ ఒక చెంచా షుగర్ రెండు చెంచాలు నిమ్మరసం ఒక చెంచా చొప్పున తీసుకొని ఈ మిశ్రమాన్ని మొహం మీద అప్లై చేసి మృదువుగా మర్దన చేసుకోవాలి, ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడుగుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా మంచి ఫలితం లభిస్తుంది. ఈ విధమైనటువంటి సింపుల్ చిట్కాలను పాటించి బ్లాక్ హెడ్స్ తొలగించుకొని ఎంతో అందమైన సౌందర్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చు.