Bayya Sunny Yadav: ప్రముఖ యూట్యూబర్, తెలుగు ట్రావెలర్ భయ్యా సన్నీ యాదవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూట్యూబ్ ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ వంటివి సోషల్ మీడియా యాప్స్ ఫాలో అయ్యే వారికి ఇతని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దేశవ్యాప్తంగానే కాకుండా తంగా అన్ని దేశాలను బైక్ లో చుట్టేస్తూ అక్కడి ప్రకృతి అందాలను కొన్ని విషయాలను ఎప్పటికప్పుడు తన ఫాలోవర్లకు పంచుకుంటూ యూట్యూబ్ లో కొన్ని వందల వీడియోలు తీస్తూ ఉంటారు. యూట్యూబర్ గానే కాకుండా నా అన్వేష్ అనే వ్యక్తితో గొడవ జరిగిన విషయంలో కూడా ఇతని పేరు బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా బయ్యా సన్నీ యాదవ్ ని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అరెస్ట్ చేశారు.
చెన్నై ఎయిర్ పోర్టులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ట్రావెల్ లో భాగంగా ఆయన కొద్ది రోజుల క్రితం పాకిస్థాన్ కు వెళ్లారు. అక్కడ పరిస్థితిలు ఎలా ఉంటాయో తన యూట్యూబ్ లో చెప్పుకొచ్చాడు. పాక్ లో మొదటిరోజు అంటూ ఒక వీడియోను ఆయన రీసెంట్ గా షేర్ చేశారు. దానిని చూసిన ఎన్‌ఐఏ అధికారులు బయ్యా సన్నీ యాదవ్ ను అరెస్ట్ చేశారు. పహల్గాంలో ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ పై భారత్ దాడికి దిగింది. ఇలాంటి సమయంలోనే బయ్యా సన్నీ యాదవ్ పాక్ వెళ్లినట్లు 10 వీడియోలను పంచుకున్నారు.
వాటిపై ఎన్‌ఐఏ అధికారులు విచారిస్తున్నారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అతను పాకిస్థాన్ వెళ్లినట్లు సమాచారం. ఏప్రిల్ లో పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు అంతర్జాతీయ స్థాయిలో చర్చలకు దారి తీసింది. ఇలాంటి సమయంలో తన వీడియోలకు ఎక్కువ వ్యూస్ వస్తాయని వాటితో డబ్చు చేసుకోవచ్చనే ఉద్దేశంతో తన యూట్యూబ్‌లో పోస్ట్ చేశారని తెలుస్తోంది. పాకిస్థాన్ కు గూఢచారిగా వ్యవహరించిందని హరియాణాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మల్హోత్రాను ఒక అస్త్రంగా పాకిస్థాన్ ఐఎస్‌ఐ ఏజెంట్లు మలచుకున్నట్లు హరియాణా పోలీసులు గుర్తించారు. ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలోని ఒక అధికారితో ఆమె టచ్ లో ఉన్నట్లు కూడా విచారణలో గుర్తించారు. ట్రావెల్ వీడియోస్ పేరుతో జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్ లో పలుమార్లు పర్యటించిందని పోలీసులు గుర్తించారు. అయితే ఆమె తరహాలోనే బయ్యా సన్నీ యాదవ్ ని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు.