AP: ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే గత ప్రభుత్వ హయామంలో పెద్ద ఎత్తున అక్రమాలకు, తెలుగుదేశం పార్టీ ఆఫీసులపై నేతలపై దాడి చేసిన వారందరిపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారు. ఇలా వైసిపి నేతలు పలువురు వరుసగా అరెస్టు అవుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ అరెస్టులను వైసీపీ నేతలు ఖండిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తుంది అంటూ విమర్శించారు.
ఇక 2029లో తిరిగి వైసిపి అధికారంలోకి వస్తే ఇప్పుడు అక్రమంగా అరెస్టు చేసిన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టమని, ఎవరైతే వైసీపీ నేతలను కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారో వారి అంత చూస్తామంటూ వార్నింగులు ఇస్తున్నారు. అయితే ఇటీవల వైసిపి ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి బుక్కరాయసముద్రం మండలం సింగల్ నియోజకవర్గ కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడుతూ ఏపీలో పోలీసులు అందరికీ కూడా చంద్రబాబు వైరస్ సోకిందని తెలిపారు.అందుకే తప్పు చేయకపోయినా వైసీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు. ఈ అక్రమ అరెస్టులకు టిడిపి తప్పనిసరిగా మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. తిరిగి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలలలోనే అందరిని జైలుకు పంపిస్తామంటూ ఈయన వార్నింగ్ ఇచ్చారు.మంత్రి లోకేశ్ అమలు చేస్తున్న రెడ్‌బుక్‌కు వైసీపీ భయపడదని తెలిపారు. వచ్చే నెల 2 నుంచి కూటమి ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు వస్తారని, ఏం చేశారని వస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చిన ఎమ్మెల్యేలను, నేతలను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇలా సజ్జల చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి అప్పటివరకు మీరు అరెస్టు కాకుండా చూసుకోండి అంటూ కొంతమంది కామెంట్లు చేయగా ముందు మొదలుపెట్టిందే మీరు అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.