AP: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో మంత్రులు ఎమ్మెల్యేలు చేసిన అవినీతిపై పెద్ద ఎత్తున విచారణలు జరిపించి వరుస అరెస్టులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది వైసిపి కీలక నేతలు అరెస్ట్ అయి జైలుకు వెళ్లారు తాజాగా లిక్కర్ స్కామ్ లో భాగంగా ఎంపీ మిథున్ రెడ్డి కూడా అరెస్టు అయ్యి రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే ఇలా ఈయన అరెస్ట్ కావడంతో కూటమి ప్రభుత్వం తదుపరి మరో కీలక నేతను టార్గెట్ చేశారని తెలుస్తోంది. మరి ఆ నేత ఎవరో కాదు నెల్లూరు ఫైర్ బ్రాండ్ అయినా అనిల్ కుమార్ యాదవ్ అని సమాచారం.
ఇప్పటికే అక్రమ మైనింగ్ కేసులో అరెస్ట్ అయిన మాజీమంత్రి కాకాణీ గోవర్ధన్ రెడ్డి జైలు జీవితం గడుపుతున్నారు. ఆయనపై పదికి పైగా కేసులు నమోదవడంతో.. ఇప్పుడప్పుడే అతనికి బెయిల్ రావడం కష్టమని తెలుస్తుంది. ఇక ఈ అక్రమ మైనింగ్ కేసులో భాగంగా అరెస్ట్ అయిన శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన సమాచారంతో ఇప్పుడు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు ఉచ్చు బిగుస్తోంది. క్వార్ట్జ్ కేసులో అనిల్ కుమార్ అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతని నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్టు తెలుస్తుంది.
శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం అనిల్ కుమార్ అక్రమ మైనింగ్ లో భాగంగా భారీగా సంపాదించి పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసి వెంచర్లుగా మార్చినట్లు శ్రీకాంత్ రెడ్డి తన వాంగ్మూలంలో పేర్కొన్నారు ఈ క్రమంలోనే అనిల్ కుమార్ యాదవ్ మెడకు కూడా ఉచ్చు బిగుస్తోంది. ఏ క్షణమైన పోలీసులు ఈయనని అరెస్టు చేయవచ్చు అనే ఊహగానాలు వినపడుతున్నాయి.గతేడాది రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక.. అనిల్ కుమార్ యాదవ్ సైలెంట్ అయ్యారు. తన మకాం చెన్నైకి మార్చారు. కానీ ఈ మధ్యే నెల్లూరుకు తిరిగివచ్చి మళ్లీ యాక్టివ్ అయ్యారు. గత వైసీపీ ప్రభుత్వంలో నెల్లూరు జిల్లా రాజకీయాల్లో అనిల్ కుమార్ యాదవ్ కీలకంగా ఉన్నారు.
