Breaking: కోలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారు. ఇదే విషయం సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతికి చెందిన శ్రీకాంత్ తెలుగులో చాలా సినిమాలలో నటించి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నారు. అతని పేరు శ్రీకాంత్ కాగా ఆ పేరును కాస్త శ్రీ రామ్ గా మార్చుకొని మొదట చిన్న చిన్న పాత్రలో నటిస్తూ ఆ తర్వాత రోజా పూలు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అలా తెలుగు తమిళ భాషల్లో మంచి మంచి సినిమాలలో నటించి మెప్పించారు శ్రీరామ్.
ఇటీవల హరికథ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుము విడుదలైన ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్గా రెస్పాన్స్ వచ్చింది. ఆ సంగతి పక్కన పెడితే తాజాగా ఈ సీనియర్ నటుడిని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో నటుడు శ్రీరామ్ కు వైద్య పరీక్షలు నిర్వహించి రక్త నమూనాలను సేకరించారు. అనంతరం నుంగంబాక్కం స్టేషన్కు శ్రీరామ్ ని తరలించి దాదాపుగా రెండు గంటల పాటు విచారించారట చెన్నై నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ పోలీసులు.
మాజీ AIADMK కార్యనిర్వహకుడు ప్రసాద్ నుంచి డ్రగ్స్ కొన్నట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు శ్రీరామ్ ని అరెస్టు చేశారట. కాగా ఇప్పటికే ఈ డ్రెస్ కేసులో భాగంగా అన్న డీఎంకే కావ్య నిర్వహకుడు ప్రసాద్ తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్న సమయంలో శ్రీరామ్ పేరు బయటపడగా అతనిని కూడా అరెస్టు చేసి విచారిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వ్యవహారం ఇంకా ఎంత దూరం వెళుతుందో చూడాలి మరి.