ఎస్పీ బాలు గారి మరణానికి సర్జరీ ఒక కారణం !?

SP Balasubramanyam

ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు శుక్రవారం చెన్నై ఆసుపత్రిలో కన్నుమూశారు. ఎస్.పి.బిగా ప్రసిద్ది చెందిన బాలసుబ్రమణ్యం, కోవిడ్ -19 కొరకు ఆగస్టు 5 న ఎంజిఎం హెల్త్‌కేర్‌లో చేరారు. గత కొన్ని రోజులుగా అతని పరిస్థితి విషమంగా ఉన్నందున వెంటిలేటర్ సహాయంతో వున్నారు .

SP Bala Subramanyam

ఎంతో మంది కరోనా సోకిన వాళ్ళు మెరుగైన వైద్యం అందకపోయినా కోలుకొని ఆరోగ్యవంతులుగా తిరిగి వచ్చారు. మరి అన్ని సదుపాయాలు వుండి నిత్యం వైద్యుల పర్యవేక్షణలో వున్నా కూడా బాలు గారు ఎందుకు కోలుకోలేకపోయాయరు అనే ప్రశ్న చాలమంది మదిని తొలుస్తోంది.

వైద్య వృత్రిలో ప్రవేశం వున్నారు చెబుతున్న ఒక కారణం బాలుగారు గతంలో చేయించుకున్న బేరియాట్రిక్ సర్జరీ ఒక కారణం అని చెబుతున్నారు. బేరియాట్రిక్ సర్జరీ అనేది జీర్ణవ్యవస్థలో మార్పులు చేయడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడే ఒక ఆపరేషన్. కొన్ని రకాల బేరియాట్రిక్ శస్త్రచికిత్సలు కడుపును చిన్నవిగా చేస్తాయి. ఆహారం తీసుకున్న ప్రతిసారి తక్కువ తినడానికి త్రాగడానికి మాత్రమే అనుమతిస్తుంది. అలాగే త్వరగా కడుపునిండిన అనుభూతిని కలిగిస్తుంది . మరి కొన్ని బేరియాట్రిక్ శస్త్రచికిత్సలు చిన్న ప్రేగులను కూడా మారుస్తాయి. ఆహారాలు మరియు పానీయాల నుండి కేలరీలు మరియు పోషకాలను తక్కువగా గ్రహిస్తాయి.

బాలు గారి విషయంలో బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నాక, తిండి బాగా తగ్గిపోయి ఆయన యిమ్యూనిటీ తగ్గిపోయిందట. ఆ సర్జరీ వలన ఆయనకు జరిగిన మేలిమి లేదు . 50 ఏళ్లు దాటినా వారు ఆ సర్జరీ చేయించుకోవడంలో రిస్కు చాలా వుందని అంటున్నారు. దాసరి నారాయణరావు విషయంలో కూడా ఇదే జరిగింది.

ఏదేమైనప్పటికీ ఐదు దశాబ్దాలు సంగీత ప్రపంచాన్ని ఒక ఊపు ఊపిన గొప్ప గాయకులు బాలుగారు. ఇంకో ఐదు దశాబ్దాలు కూడా బాలు పాట ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటుంది. ఈ ఐదు దశాబ్దాల్లో తన పాట ద్వారా శ్రోతల్ని అనేక అనుభూతులు కల్పించిన బాలు, తన మరణం తో బాధ పడుతున్న వారికి కూడా తన పాటే ఓదార్పవుతుండటం విశేషం.

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరన్నవార్త కోట్ల మందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. 16 భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపంతెలుపుంది తెలుగురాజ్యం.