ఛిద్రమైన నా జీవితంలో వెలుగు నింపారు – సింగర్ సునీత

Singer Sunitha

అందరిలాగే గాయకురాలు సునీత కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి మరణంతో తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. తన విషాదాన్ని తెలియజేస్తూ ఇంస్టాగ్రామ్ లో తాను బాలు గారు కలిసివున్న ఒక ఫోటో పెట్టి, అందరి హృదయాలు కరిగేలా బాలు గారి మీద తనుకున్న ప్రేమను, అనుబంధాన్ని క్రింది విధంగా తెలియజెప్పింది.

Singer Sunitha

నా ఛిద్రమైన జీవితం లో వెలుగులు నింపిన వ్యక్తి. నాకు పాట మీద ప్రేమ కలిగించి, పాడాలనే తపన పెంచి, నా బాగోగులు గమనిస్తూ నాకు బాసటగా నిలుస్తూ జీవితం మీద మమకారం పెంచిన వ్యక్తి నా ఆత్మ బంధువు. నా మావయ్య. భౌతికంగా లేరు అంతే

ఈ మెసేజీ లో సునీత మనకు చాలా విషయాలు చెప్పకనే చెబుతుంది. తన వైవాహిక జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు నుండి, తనకు పాట మీద ప్రేమ పుట్టేలా చేసి, తాను అనేక పాటలు పాడి జీవితంలో స్థిరపడడానికి కారణమైన వ్యక్తి, తన ఆత్మ బంధువు ఇప్పుడు భౌతికంగా తనతో లేకపోయినా తన జ్ఞాపకాల్లో తనను ముందుకు నడిపించడంలో తనతోనే వుంటారు అని తెలియజేసింది. గతంలో ఎక్కడా ఎస్పీ బాలసుబ్రమణ్యం గారిని ఏ వేదిక మీద కూడా సునీతగారు మామ అని పిలవలేదు అలాగే మామగారు అని సంబోధిస్తుందని కూడా చెప్పలేదు. ఈ మెసేజ్ ద్వారా బాలసుబ్రమణ్యం గారు తన మామ అని ముగించింది.

సునీత నేపధ్య గాయనిగా 1995 లో గులాబీ చిత్రంతో తన కెరీర్ ప్రారంభించారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రముఖ ప్లేబ్యాక్ గాయకురాలిగా తన మధుర స్వరంతో తనదైన గుర్తింపు తెచ్చుకుంది. వివిధ ఛానెళ్లలో సంగీత రియాలిటీ షోలకు న్యాయమూర్తిగా సునీత వ్యవహరిస్తారు . డబ్బింగ్ ఆర్టిస్ట్ గా 750 కి పైగా చిత్రాలలో 110 మందికి పైగా నటీమణులకు వాయిస్ ఇచ్చారు.