ఎస్పీ బాలు చివరి వీడియో.. హాస్పిటల్ లో వైద్యులతో..

sp balasubrahmanyam last pic in hospital before he died

యావత్ సినీ ప్రపంచమే ఎస్పీ బాలు మృతితో దిగ్భ్రాంతికి లోనయింది. ఆయన లేని లోటు సినీ రంగానికి ఎప్పటికీ పూడ్చలేనిది. ఆయన కంఠం ఇక మూగబోయింది. ఎస్పీ బాలు శుక్రవారం మధ్యాహ్నం చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే.

sp balasubrahmanyam last pic in hospital before he died

యావత్ సినీ ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. పలువురు సినీ ప్రముఖులు ఆయనతో తమకు ఉన్న బంధాన్న ఈసందర్భంగా గుర్తు చేసుకొని ఆయనకు మృతికి నివాళులు అర్పిస్తున్నారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

sp balasubrahmanyam last pic in hospital before he died

ఆగస్టు 5న బాలుకు కరోనా సోకగా.. వెంటనే చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆయన అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొన్ని రోజులకు ఆయనకు కరోనా తగ్గి.. ఆయన కొంచెం నార్మల్ అయ్యారు. ఆ తర్వాత మళ్లీ ఆయన ఆరోగ్యం క్షీణించడంతో.. ఎక్మో, వెంటిలేటర్ సాయంతో ఆయనకు చికిత్స అందిస్తూ వచ్చారు. అయినప్పటికీ ఆయన ప్రాణాలు నిలవలేదు.

అయితే.. బాలు చనిపోవడానికి ముందు వైద్యులతో ఉన్న చివరి వీడియో, ఫోటో బయటికి వచ్చాయి. వైద్యులు ఎస్పీ బాలుకు చిన్ని పైడిల్ లాంటి పరికరాన్ని ఇచ్చి దాన్ని తిప్పాలంటూ ఆయనకు సూచించగా.. ఆయన నెమ్మదిగా దాన్ని తిప్పడం ప్రారంభించారు. దీంతో డాక్టర్లు.. వెరీ గుడ్ సార్.. వెరీ గుడ్.. అలాగే తిప్పండి అంటూ ఆయనకు ఎంకరేజ్ చేశారు. కొంత సేపు తిప్పి ఆ తర్వాత ఆయన దాన్ని తిప్పలేకపోయారు. అలాగే ఆయనకు ట్రీట్ మెంట్ చేస్తున్న ఫోటో కూడా బయటికి వచ్చింది. అవే ఆయన చివరి వీడియో, చివరి ఫోటో. ఆ తర్వాత ఎస్పీ బాలు ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు.