ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పార్టీలో కొంత మంది నేతలకు అందుబాటులో ఉండటం లేదని..ఈ నేపథ్యంలో అధికార పార్టీలో అసమ్మతి సెగ రేగుతున్నట్లు ఇప్పటికే ప్రచారంలోకి వచ్చింది. అయితే దాన్ని నెమ్మదిగా పార్టీ క్షీణించేలా చేసింది. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణమరాజు వ్యతిరేక వైఖరితో వైకాపాకి పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాల్లో కొంత నష్టమైతే జరిగింది. దీంతో జగన్ మోహన్ రెడ్డి కూడా రఘురామకృష్ణం రాజును సీరియస్ గా తీసుకుని పట్టించుకోవడం మానేసారు. జగన్ పై తిరగబడితే ఎలా ఉంటుందో? రఘురామకు ఆ రకంగా చూపించారు.
తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో చక్రం తిప్పిన తోట ఫ్యామిలీకి అదే గతి పట్టిందని సమాచారం. అమలాపురం మాజీ ఎమ్మెల్యే మెట్ల సత్యనారాయణ కుమార్తె తోట వాణి- ఆమె భర్త నరసింహం కాగ్రెస్ హయంలో జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. 2004, 2009 ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే రాష్ర్ట విభజన తర్వాత తోట ఫ్యామిలీ కాంగ్రెస్ ని వీడి 2014 లో టీడీపీ లో చేరింది. ఎన్నికల్లో గెలిచిన నరసింహులు కాకినాడ ఎంపీగా పనిచేసారు. అయినా ఆ ఫ్యామిలీని అసంతృప్తి వెంటాడింది. 2019 ఎన్నికల్లో పిఠాపురం గానీ, జగ్గంపేట అసెంబ్లీ సీటు గానీ ఇవ్వాలని టీడీపీకి అల్టిమేటం జారీ చేసారు. దీంతో చంద్రబాబు నాయుడు ఆ ఫ్యామిలీని పూర్తిగా పక్కనబెట్టారు.
ఆ తర్వాత వైసీపీ లో చేరారు. పిఠాపురం టిక్కెట్ ఆశించగా జగన్ పెద్దాపురం పంపించారు. కానీ నిమ్మకాయల చినరాజప్ప చేతిలో ఓటమి తప్పలేదు. తర్వాత ప్రభుత్వంపై రాజ్యసభ సీటు ఇప్పించాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో వైసీపీ కూడా పక్కనబెట్టింది. పెద్దాపురం ఇంచార్జ్ బాధ్యతల్ని గతంలో పనిచేసిన దవులూరి దొరబాబుకే మళ్లీ అప్పగించారు. ఈ నేపథ్యంలో తొట ఫ్యామిలీ బీజేపీలో చేరే ప్రయత్నాలు చేసినప్పటికి ట్రాక్ రికార్డు చూసి ఆ పార్టీ కూడా పట్టించుకోలేదుట. ప్రస్తుతం తోట ఫ్యామిలీకి ఏ పార్టీ లేక ఖాళీగానే ఉంది. ఈ నేపథ్యంలో తూర్పు లో తోట ఫ్యామిలీ రాజకీయాలు ముగిసినట్లేనన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది.