వడ్డించే వాడు మనోడు అయితే బంతిలో ఎక్కడ కూర్చున్న ఒకటే అన్నట్లు, అధికారంలో వున్నాడు మనోడు అయితే ఎన్ని ఆటలైనా ఆడుకోవచ్చు అనేది నిజం, అందుకే అధికారంలో ఉన్నోళ్లు వెనుక మిగిలిన వాళ్ళు పరుగులు పెడుతుంటారు. ఇదే కోవలో టీడీపీ అధినేత చంద్రభాబు నాయుడు పరుగులు పెడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ను తట్టుకొని తాను నిలబడాలన్న, తమ పార్టీ నిలబడాలన్న ఖచ్చితంగా కేంద్రంలోని బీజేపీ అనుగ్రహం కావాలి, అయితే బాబు యొక్క జిత్తులమారి రాజకీయం చూసిన బీజేపీ మరోసారి చంద్రబాబుని నమ్మే స్థితిలో లేదు. అయినాసరే పట్టువదలని విక్రమార్కుడిలా బాబు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.
తాజాగా మరో భారీ ఆఫర్ పట్టుకొని బీజేపీ గడప దగ్గర నిలబడ్డాడు. తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గ ప్రసాద్ చనిపోవటంతో ఉపఎన్నిక జరగబోతుంది. ఈ ఎన్నికల్లో తాము పోటీచేయకుండా బీజేపీ పార్టీ అబ్యర్దికి టీడీపీ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని, బీజేపీ కోసం తిరుపతిలో పోటీ చేయబోమని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. నిజానికి తిరుపతి పార్లమెంటరీ స్థానంలో టీడీపీకి అసలు పట్టు అనేదే లేదు.. టీడీపీ పార్టీ చరిత్రలో ఒకే ఒక్కసారి గెలిచింది. అది కూడా 1984 ఎన్నికల్లో. అప్పటినుండి నేటి వరకు ఆ స్థానంలో తెలుగుదేశం గెలవలేకపోయింది. అక్కడ టీడీపీ పోటీ అనేది నామమాత్రమే తప్ప విజయం సాధించే సత్తా లేదని తెలుస్తుంది.
అలాంటి స్థానాన్ని చంద్రబాబు నాయుడు బీజేపీకి ఉచితంగా ఇస్తానని చెప్పటం విశేషం. ఎలాగూ తాము గెలవలేమని తెలిసి, పోటీచేయకుండా ముందే బీజేపీకి మద్దతు ఇస్తే ఆ పార్టీ అధిష్టానం దృష్టిలో పడొచ్చు అనేది బాబుగారి ఆలోచన. ప్రస్తుతానికి ఆంధ్రాలో బీజేపీ పార్టీ జనసేనలో కలిసి ప్రయాణం సాగిస్తుంది. మెల్ల మెల్లగా సొంత క్యాడర్ ను పెంచుకునే పనిలో వుంది,. ఇలాంటి సమయంలో మళ్ళీ టీడీపీతో పొత్తు పెట్టుకోవటం ఆ పార్టీకి నష్టమే తప్ప లాభం కాదు. వాస్తవానికి లోక్ సభలో బీజేపీకి కొత్తగా అదనపు బలం అక్కర్లేదు కూడా. కాబట్టి చంద్రబాబు చేసిన ప్రతిపాదనను బీజేపీ తిరస్కరించే అవకాశం మెండుగా వుంది. అదే జరిగితే ఈ సారికూడా బీజేపీ కి దగ్గర కావాలనే బాబు ప్లాన్ బెడిచికొట్టినట్లే..