జగన్ ఆ నిర్ణయం తీసుకుంటే బాబుకి ముడినట్లే

jagan cbn telugu rajyam

  ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షము టీడీపీ విషయంలో కర్ర విరగకుండా పామును చంపే సూత్రం అవలంబిస్తున్నాడు. టీడీపీ పార్టీ ని డైరెక్ట్ గా టార్గెట్ చేసినట్లు కనిపించటం లేదు కానీ, ఆ పార్టీకి జరగాల్సిన నష్టం మాత్రం గట్టిగానే జరిగేలా చూస్తున్నాడు. ఇప్పటికే నాలుగురైదుగు ఎమ్మెల్యే లు టీడీపీ కి గుడ్ బై చెప్పేసి, వైసీపీ వెంట నడుస్తున్నారు, సీఎం జగన్ అనుమతి ఇస్తే మరో పదిమంది దాక వైసీపీ లోకి రావటానికి సిద్ధంగా ఉన్నారనే సమాచారం వుంది.

chandrababu jagan telugu rajyam

 

  జగన్ మాత్రం వాళ్ళని అక్కడే ఉంచి, చంద్రబాబులో ఒక రకమైన అభద్రతా భావం కలిగేలా చేయటంలో సఫలం అయ్యాడు. రాజకీయంగా ఇది ఒక రకంగా తెలివైన ఎత్తుగడ అనే చెప్పాలి, గత కొద్దీ రోజులుగా వినిపిస్తున్న మాటలు ఏమిటంటే వైసీపీ పార్టీ అధికారికంగా NDA కూటమిలో చేరబోతుందని, బీజేపీ నాయకత్వం వహిస్తున్న ఈ కూటమిలో రెండు మూడు పార్టీలు వైదొలిగిన విషయం తెలిసిందే, వాటి స్థానంలో వైసీపీ కి ఛాన్స్ ఇవ్వాలని బీజేపీ పెద్దలు అనుకుంటున్నారు, ఇప్పటికే అమిత్ షా తో దానికి సంబంధించిన మాటలు జరిగినట్లు తెలుస్తుంది. ఈ నెల ఆరో సీఎం జగన్ పీఎం మోడీతో సమావేశం కాబోతున్నాడు, అందులో తమ చేరిక గురించి జగన్ మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తుంది. అదే కనుక జరిగితే టీడీపీ పార్టీ భవిష్యత్తు అంధకారంలో పడినట్లే, సీఎం జగన్ ను తట్టుకోవటానికి ఎలాగోలా కేంద్రంలోని బీజేపీ అనుగ్రహం కోసం ఎదురుచూస్తున్నా బాబుకి ఈ పరిణామాలు గట్టి షాక్ అనే చెప్పాలి.

  ఇప్పటికే చంద్రబాబును ఇరుకున పెట్టటానికి జగన్ అనేక సన్నాహాలు చేస్తున్నాడు, ఇలాంటి సమయంలో కేంద్రం మద్దతు సీఎం జగన్ కి లభిస్తే చంద్రబాబుకి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాడని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు. సీఎం జగన్ ఎలాగైనా బాబును జైలుకి పంపించాలనే పట్టుదలతో ఉన్నట్లు కొందరు చెప్పే మాట. బీజేపీతో జగన్ కలిస్తే కచ్చితంగా చంద్రబాబు మీద సిబిఐ కేసు నమోదు చేయాలనే డిమాండ్ కూడా చేసే అవకాశం లేకపోలేదు. చంద్రబాబు నాయుడు లాంటి నేతను ఇరుగున పెట్టాలంటే కేంద్రం మద్దతు తప్పనిసరి, అందుకే సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆ దిశగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే చంద్రబాబుకి శ్రీ కృష్ణ జన్మస్థానం తప్పకపోవచ్చు.