చిన్నమ్మ తో బాబుకి చిక్కులు తప్పవా ..?

CBN Purandeswari Telugu Rajyam

టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసే రాజకీయాల గురించి, అధికారం కోసం అయన వేసే ఎత్తుగడల గురించి రాజకీయాలను పరిశీలించే వాళ్ళకి బాగానే తెలిసి ఉంటుంది. ఎన్టీఆర్ నుండి పార్టీ పగ్గాలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు చంద్రబాబు ఒంటరిగా బరిలో దిగి గెలిచిన ఆనవాలు లేవు. ప్రతిసారి ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకొని ఎన్నికల గోదాంలోకి దిగటం తప్పితే ఒంటరి పోరు సుతారం ఇష్టం ఉండదు బాబుకి.

CBN Purandeswari Telugu Rajyam

 

2019 లో ఒంటరిగా ఎన్నికలకు వెళ్లిన బాబుకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీనితో వచ్చేసారి ఎలాగైనా అధికారం చేపట్టాలని ఆలోచిస్తున్న బాబు మెల్లగా బీజేపీ కి దగ్గర కావాలని చూస్తున్నాడు. బీజేపీతో జత కడితే ఆటోమేటిక్ గా పవన్ కళ్యాణ్ మద్దతు కూడా టీడీపీ కి వస్తుంది. దానికి తోడు ఎలాగూ సిపిఐ, సీపీయం లాంటి పార్టీల మద్దతు కూడా సంపాదించుకోవచ్చు అనే ఆలోచనలో బాబు వున్నాడు. అందుకే తాను కానీ, అయన వర్గం మీడియా కానీ అటు బీజేపీని, ఇటు జనసేనను ఒక్క మాట అనటం లేదు. అయితే ఏపీ బీజేపీ పార్టీ అధక్ష్య పదవిలోకి సోము వీర్రాజు రావటంతో చంద్రబాబు ఆశలకు గండి పడినట్లు అయ్యింది. కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా ఉన్నంత కాలం బీజేపీ పార్టీ తెలుగుదేశం తోక పార్టీ అనే ముద్ర ఉండేది. సోము వీర్రాజు రావటంతో టీడీపీకి ప్రధాన శత్రువు బీజేపీ అయ్యినట్లు కనిపిస్తుంది. బాబు మాటెత్తితేనే సోము వీరావేశం చూపిస్తున్నాడు, దీనితో బాబులో కలవరం మొదలైంది. ఇదే సమయంలో పురంధేశ్వరి బీజేపీ జాతీయ కార్యవర్గంలో చోటు సంపాదించుకోవడం జరిగింది. ఈ పరిణామం టీడీపీని మరింత కలవరపాటుకు గురిచేసింది.

  చంద్రబాబు రాజకీయానికి ఎన్టీఆర్ తర్వాత బలైంది దగ్గుపాటి కుటుంబమే, ఆ చేదు జ్ఞాపకాలను ఇప్పటికి దగ్గుపాటి దంపతులు మర్చిపోలేదు, కాబట్టి పురంధేశ్వరి జాతీయ స్థాయిలో వున్నప్పుడు బాబు బీజేపీ దగ్గర కావటం కష్టమైన పనే అవుతుంది. అయితే ఇదే సమయంలో టీడీపీ లోని కొందరి నేతల నుండి, టీడీపీ అనుకూల మీడియా నుండి పురంధేశ్వరికి ఊహించని మద్దతు లభిస్తుంది. ఆమెపై విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేతల కంటే టీడీపీ నేతలే ఖండిస్తున్నారు. మీడియా కూడా చిన్నమ్మ కి మద్దతుగా నిలుస్తుంది. ఇవన్నీ గమనిస్తే ఎలాగైనా సరే చిన్నమ్మని టీడీపీకి దగ్గర చేసి, ఆమె ద్వారా బీజేపీకి దగ్గర కావాలని బాబు అండ్ కో ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే చిన్నమ్మ (పురంధేశ్వరి ) ఇవన్నీ తెలియని అమాయకురాలు కాదు. పైగా బాబు రాజకీయాలకు బలైన మనిషి, కాబట్టి బాబు ఉచ్చులో ఆమె చిక్కటం దాదాపు అసాధ్యం. చిక్కటం అటుంచి ఆమె ద్వారా చంద్రబాబుకి చిక్కులు ఎదురుకాకుండా ఉంటే అదే పదివేలు