ఏపీ రాజకీయాల్లో గత ఎన్నికలకు ముందు వరకు కలిసి మెలిసి తిరిగినా గురు శిష్యులు గంటా శ్రీనవాసరావు అండ్ అవంతి శ్రీనివాస్. ఈ ఇద్దరిలో ఒకరు మాజీ మంత్రి కాగా, మరొకరు ప్రస్తుతం మంత్రి. దాదాపు దశాబ్దం పాటు కలిసి మెలిసి తిరిగిన వారిద్దరు, ఇప్పుడు కత్తులు దూసుకుంటున్నారు. రాజకీయాల్లో శతృత్వం సహజమే కానీ, మరీ ఇంతలా వార్నింగులు ఇచ్చుకునే స్థాయికి వారిద్దరి మధ్య వైరం పెరగడం.. ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. మరి ఇంతగా పొలిటికల్ హీట్ రాజేస్తున్న గురు శిష్యుల మ్యాటర్ ఏంటో తెలుసుకుందామా..
విశాఖ జిల్లాలో రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. అసలు మ్యాటర్ ఏంటంటే తాజాగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పై ప్రస్తుత ఏపీ పర్యాటక శాఖ మంత్రి అయిన అవంతి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యల రాజకీయవర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఈ మధ్య గంటా శ్రీనివాస్‌కు సంబంధించి ఎలా సిట్యువేషన్ వచ్చినా, అవంతి శ్రీనివాస్ విమర్శలతో చెలరేగిపోతున్నారు. అయితే ఇప్పుడు ఏకంగా వార్నింగులు ఇచ్చుకునే స్థితికి చేరడం, ఈ ఇద్దరు నేతలు మధ్య విబేధాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధమవుతోంది.
ఇక అసలు విషయంలోకి వెళితే.. ఏపీలో ప్రస్తుతం టీడీపీ నేతలు అరెస్టుల భయంతో వణికిపోతున్నారు. ఈ క్రమంలో అవంతి శ్రీనివాస్, తాజాగా గంటా శ్రీనివాస్ పై పేల్చిన మాటల తూటాలు ఇప్పుడు హాట్‌టాపిక్ అవుతున్నాయి. ఆ మ్యాటర్ ఏంటంటే గతంలో భీమిలీ ఎమ్మెల్యేగా, మంత్రిగా గంటా శ్రీనివాస్ ఉన్న సమయంలో వందల కోట్ల విలువ చేసే భూములు కబ్జా అయ్యాయని, ఆ తర్వాత అదే నియోజకవర్గానికి తాను ఎమ్మెల్యేగా ఉంటున్న క్రమంలో, అక్కడ గజం భూమి కూడా కబ్జా కాకుండా పరిరక్షిస్తున్నానని అవంతి వ్యాఖ్యలు చేశారు.
అయితే కేవలం రాజకీయంగా ఆరోపణలు చేయడమే కాకుండా, భూముల కబ్జాకు సంబంధించి కీలకమైన సమాచారాన్ని, ముఖ్యమంత్రి జగన్ ముందు పెట్టారని టాక్. ఇక గతంలో ఇదే సమాచారాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకోలేదని, అయితే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మాత్రం గంటాను వదిలిపెట్టే సమస్యేలేదని అవంతి హెచ్చరించారు. ఇక భూకుభకోణం పై ఇప్పటికే సిట్ విచారణ పూర్తయ్యింది. ఈ క్రమంలో అక్రమాల చిట్టా మొత్తం సిట్‌కు చేరిందని మంత్రి అవంతి చెబుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి గంటా సన్నిహితుడు నలంద కిషోర్‌ను అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసులో మరిన్ని అరెస్టులు ఉంటాయని అవంతి అంటున్నారు. మరి జగన్‌కు అవంతి ఇచ్చిన సమాచారంతో గంటా శ్రీనివాసరావు బుక్ అవుతారో లేదో చూడాలి.