నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ పై వేణుస్వామి కామెంట్స్

సెలెబ్రిటీస్  పర్సనల్ విషయాల గురించి కామెంట్స్ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు వేణుస్వామి. సమంత, నాగ చైతన్య విడాకులు, ప్రభాస్, విజయ్ దేవరకొండ కెరీర్ ల గురించి, అలాగే రష్మిక మందన్న బ్రేక్ అప్ గురించి చాలా సార్లు వివరించిన వేణుస్వామి ఈ సారి నందమూరి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పై కొన్ని కామెంట్స్ చేసాడు.

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌తిరోజు రాహుకాలం చూసుకుంటారు అని, య‌మ‌గండ కాలాన్ని చూస్తార‌ని వేణుస్వామి చెప్పారు. బాల‌కృష్ణ నాకు ఫోన్ చేసినా చెప్పిన స‌మ‌యం మంచిదో కాదో చెక్ చేసుకుంటారు అని చెప్పుకొచ్చారు.

బాల‌య్య‌కి మ‌నం చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదని.. ఆయ‌నే చెబుతారు అని అన్నాడు వేణుస్వామి. బాల‌కృష్ణ దాదాపు అన్నింటినీ ఫాలో అవుతారని, మోక్ష‌జ్ఞ జాతకం కూడా చూశానని.. ఆయ‌న సినిమాల్లోకి రావ‌డానికి కొంచెం స‌మ‌యం ఉంద‌ని చెప్పుకొచ్చారు. మోక్షజ్ఞ సినీ కెరీర్ చాలా బాగుంటుందని వెల్ల‌డించారు.

కుటుంబ స‌భ్యులు మాత‌రం వీలైనంత ఆల‌స్యంగా మోక్ష‌జ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాల‌ని భావిస్తున్నారని తెలిపారు వేణుస్వామి. ముఖ్యంగా మోక్ష‌జ్ఞ సినిమాల్లోకి రావాలంటే రెండు నుంచి మూడేళ్ల స‌మ‌యం ఉంటుంద‌ని వేణుస్వామి అన్నాడు.