గజపతుల మధ్య యుద్ధం ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం ప్రస్తుత ట్రస్ట్ ఛైర్ పర్సన్ సంచయిత గజపతిరాజుకు మాజీ ట్రస్ట్ ఛైర్మన్ అశోక్‌గజపతి రాజుకు మధ్య భీకర యుద్ధమే జరుగుతోంది.మాటలే తూటాలై పోతున్నాయి. ట్విట్టర్ లో పెట్టే పోస్టులే బాంబులై పేలుస్తున్నాయి. మాజీ కేంద్రమంత్రి అశోక గజపతి రాజు… సేవ్ మాన్సాస్ పేరుతో ట్విట్టర్ లో ప్రారంభించిన ఉద్యమంపై ఘాటుగానే స్పందించారు సంచయితా . సేవ్ మాన్సాస్ పేరుతో అశోకగజపతిరాజు చేస్తున్నది… నిజానికి సేవ్ అశోక్ క్యాంపైన్ అని ఆరోపించారు. ఆయన ఆధ్వర్యంలో మాన్సాస్ లో చోటుచేసుకున్న అక్రమాలను తాను తోడి తీస్తున్నాననే తనపై దుష్పప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ముందు తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని చాంతాడం లిస్టు పెట్టారు. అందులో మచ్చుక్కు కొన్ని.
- 150 ఏళ్ల చారిత్రాత్మక మోతీ మహల్ ను నేలమట్టం చేసినప్పుడు సేవ్ మాన్సాస్ క్యాంపైన్ ఏమైంది.
- 8 వేల ఎకరాల మాన్సాస్ భూములను ఎకరాకు 5 వందల రూపాయల చొప్పున అనుచరగణానికి అప్పజెప్పినప్పుడు సేవ్ మాన్సాస్ క్యాంపైన్ ఏమైంది.
- మార్కెట్ ధరలతో సంబంధం లేకుండా ఇష్టం వచ్చిన ధరలకు మాన్సాస్ భూములు లీజుకు ఇచ్చినప్పుడు సేవ్ మాన్సాస్ క్యాంపైన్ ఏమైంది.
- కనీసం లాయర్ ను పెట్టుకోకపోవడం వల్ల 13 కోట్ల విలువైన మాన్సాస్ భూములు ఎక్స్ పార్టీ డిక్రీ ద్వారా అన్యాక్రాంతమైనప్పుడు సేవ్ మాన్సాస్ క్యాంపైన్ ఏమంది.
- 2016 నుంచి 2020 లో సరైన సమాచారం ఇవ్వనందున మాన్సాస్ విద్యా సంస్థలకు 6 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. మరి అప్పుడు ఏమైంది సేవ్ మాన్సాస్ క్యాంపైన్.
- ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత విద్యామండలి నుంచి అనుమతులు తెకపోవడం వల్ల 170 మందికి ఇచ్చిన డిగ్రీ పట్టాలు చెల్ల లేదు. మరి అప్పుడు ఏమైంది సేవ్ మాన్సాస్ క్యాంపైన్.
- వేల కోట్ల రుపాయలు ఆస్థులు ఉన్న ట్రస్ట్ జమా ఖర్చులు సరిగ్గా రాయనప్పుడే ఏమైంది సేవ్ మాన్సాస్ క్యాంపైన్.
- సేమ్ మాన్సాస్ ఉద్యమం నాది. మీది కాదు
పురాతన వైభవాన్ని పునరుద్ధరించాలని ప్రయత్నిస్తున్నది నేను. కాజేసి సొమ్ముచేసుకోవాలనుకుంటున్నది మీరు. ముంద మీ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోండి’అంటూ ట్వీట్ ముగించారు.