మహిళల్లో చాలామంది గోరింటాకు పెట్టుకోవడాన్ని ఎంతగానో ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. తెలుగు సంవత్సరంలో ఆషాడ మాసం నాలుగో నెల కాగా ఆషాడ శుద్ధ పౌర్ణమి రోజును గురు పౌర్ణిమ అని కూడా పిలవడం జరుగుతుంది. అషాడ మాసంలో పెళ్లైన మహిళలు గోరింటాకు పెట్టుకుంటే మంచి జరుగుతుందని చాలామంది భావిస్తారు. అషాడమాసంలో గోరింటాకు పెట్టుకోవడం వెనుక ఆరోగ్య రహస్యం కూడా ఉండటం గమనార్హం.
వర్షాకాలంలో ఆషాడ మాసం వస్తుందని అందరికీ తెలుసు. ఇతర కాలాలతో పోల్చి చూస్తే వర్షాకాలంలో అంటువ్యాధుల బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. వర్షాకాలంలో వర్షాలు కురవడం వల్ల వాతావరణంలో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. గోరింటాకు పెట్టుకోవడం వల్ల శరీరంలోని వేడి బయటకు వచ్చి మన ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
గోరింటాకు ఒత్తిడిని తగ్గించడంతో పాటు నోటి ద్వారా క్రిములు శరీరంలోకి వెళ్లకుండా చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆడవాళ్లు గోరింటాకును పెట్టుకోవడం వల్ల చేతులు అందంగా కనిపించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. అషాడ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల కాళ్లు, చేతులు పగిలే అవకాశాలు సైతం తక్కువగా ఉంటాయని పెద్దలు చెబుతున్నారు.
గోరింటాకును పెట్టుకోవడం వల్ల ఎంతోకాలం నుంచి మానని గాయాలు సైతం సులభంగా నయమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చాలామంది భావిస్తారు. ఆషాడమాసంలో దీక్షలు, వ్రతాలు చేయడం వల్ల శుభ ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. గోరింటాకును వాడటం వల్ల లాభమే కానీ నష్టం ఉండదు. ఇవి కాకుండా రసాయనాలతో చేసిన కోన్లను వాడితే మాత్రం ఆరోగ్యానికి హాని కలిగే ఛాన్స్ ఉంటుంది.